మొదటి రోజు బాలా త్రిపుర సుందరి కి ప్రత్యేక పూజలు
బొబ్బిలి,సూర్య: బొబ్బిలి పట్టణం గొల్లపల్లి బైపాస్ రోడ్ శ్రీ దాడితల్లి గుడి లో శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.ఇందులో భాగంగా మొదటి రోజు ఆదివారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి గా అమ్మవారు పూజలు అందుకున్నారు, అన్ని గ్రామాల నుండి వేకువజామునుండీ భక్తులు కుంకుమ పూజలో పాల్గొన్నారు. భవానీ దీక్షలు ప్రారంభించారు. అర్చకులు పిండిప్రోలు మణి కుమార్ శర్మ ఆధ్వర్యంలో పూజలు , హోమాలు నిర్వహించారు.