మెట్టెక్కివలస ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్లు అందజేత
ఆమదాలవలస,
ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో భాగంగా ప్రభుత్వం ఉన్నత పాఠశాలలకు కంప్యూటర్లను అందజేస్తుంది. పాఠశాల స్థాయి నుండి విద్యార్థులు కంప్యూటర్ విద్యపై అవగాహన పెంచుకోవడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగానికి అనుగుణంగా విద్యార్థులు తయారు చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఆమదాలవలస ఎమ్మెల్యే, పియుసి చైర్మన్ కూన రవికుమార్ కృషితో ఇప్పటికే నియోజకవర్గంలో పలు పాఠశాలలకు కంప్యూటర్లు మంజూరయ్యాయి. కొత్తగా మెట్టెక్కివలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు 14 కంప్యూటర్లు మంజూరు చేయించారు. ఈ కంప్యూటర్లను పాఠశాలకు ఆదివారం జరిగిన కార్యక్రమంలో పాఠశాల కమిటీ ద్వారా ఉపాధ్యాయులకు అందజేశారు.