BREAKING
రాజంపేటలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు బంగారు మైసమ్మ సన్నిధిలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ప్రత్యేక పూజలు ట్రిపుల్ రైడింగ్‌పై పోలీసుల కొరడా.. యువతకు కౌన్సెలింగ్ దుగినేపల్లి చెరువు వద్ద బతుకమ్మ నిమజ్జనానానికి ఏర్పాట్లు అంగడి బజారుకు ప్రత్యేక స్థలం కేటాయించాలి! మండలం ప్రజల డిమాండ్ ఆనవరంలో వైసీపీకి షాక్‌.. టీడీపీలోకి 40 కుటుంబాలు! అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం చప్పబుచ్చంపేట వైసీపీ ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థి ఖరారు పారిశుధ్య కార్మికులకు దసరా కానుకలు అందజేసిన కౌన్సిలర్ శాంతిరాజు నాయక్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ రద్దు... *ఎంపీడీవో బి వి జ పాత్రో పూల పండుగలో పాల్గొన్న మహిళలు.. పాటలు, ఆటలతో సందడి శ్రీ కోట దుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎన్ జి ఓ నాయుకులు నేడు ఎంపీటీసీ ఎన్నికలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల *ఎంపీడీవో నడిమింటి సూర్యనారాయణ వెల్లడి దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాదారం సర్పంచ్ రాములు మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా పట్నాన సాయిశ్రీ ని ఖరారు

మతతత్వ రాజకీయాలను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అనంతపురం మేయర్ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై పోరాడే నాయకులనే ఎన్నుకోవాలి బీజేపీ మేయర్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, ఐఎఫ్‌టీయూ నాయకులు

Select Suryaa Now
మతతత్వ రాజకీయాలను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం  అనంతపురం మేయర్ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై పోరాడే నాయకులనే ఎన్నుకోవాలి  బీజేపీ మేయర్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, ఐఎఫ్‌టీయూ నాయకులు

అనంతపురం బ్యూరో (అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్) : అనంతపురం నగర మేయర్ ఎన్నికల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే నాయకులను ఎన్నుకోవాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, ఐఎఫ్‌టీయూ, ప్రజాసంఘాల నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. మతతత్వ రాజకీయాలను తిరస్కరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. అనంతపురం మేయర్ పదవికి బీజేపీ అభ్యర్థిత్వం కల్పించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు.

ఆదివారం అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, ఐఎఫ్‌టీయూ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి జి. వేమన, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బి. సురేష్ మాట్లాడారు. కేంద్రంలో గత 12 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ, అనంతపురం నగర ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి, నగర అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టడంలో విఫలమైందని వారు విమర్శించారు.

రాయలసీమ డిక్లరేషన్ ఏమైంది..…

కర్నూలులో బీజేపీ ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ అమలు ఏమైందని నాయకులు ప్రశ్నించారు. డిక్లరేషన్‌లో పేర్కొన్న ప్రకటనలు, హామీల అమలుపై ఇప్పటికీ స్పష్టత లేదని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధి విషయంలో బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

మత సామరస్యానికి విఘాతం కలిగించొద్దు

లౌకికవాద స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన అనంతపురం నగరంలో మత విద్వేషాలకు తావివ్వకూడదని నాయకులు పేర్కొన్నారు. వివిధ మతాలు, కులాలు, వర్గాలకు చెందిన ప్రజలు సోదరభావంతో కలిసి జీవించే నగరంలో విభజన రాజకీయాలను ప్రజలు తిరస్కరించాలని కోరారు. దేశవ్యాప్తంగా దళితులు, ఆదివాసీలు, మైనారిటీలపై దాడులు, అణచివేతలు పెరుగుతున్నాయని బీజేపీ విధానాలపై విమర్శలు చేశారు.

బుల్డోజర్ రాజకీయాలు కాదు.. అభివృద్ధి కావాలి

బీజేపీ పాలనలో బుల్డోజర్ రాజకీయాలు పెరిగిపోతున్నాయని, కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధానాలతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారని నాయకులు ఆరోపించారు. ప్రజలకు ఉపాధి, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, తాగునీరు, పారిశుధ్యం, రహదారులు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన పాలకులు ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని విమర్శించారు.

అనంతపురం నగరానికి కావాల్సింది మత విద్వేషాలు కాదని, అభివృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలని స్పష్టం చేశారు. నగరంలో పారిశుధ్యం, తాగునీరు, మురుగునీటి కాలువలు, రహదారులు, వీధి దీపాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పేదలు, కార్మికులు, చిరు వ్యాపారులు, అట్టడుగు వర్గాల ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచడమే నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీని రుద్దడం సరికాదు

చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం అనంతపురం నగర ప్రజలపై బీజేపీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. రాజకీయ స్వార్థంతో తీసుకునే నిర్ణయాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజలు ఈ రాజకీయ పరిణామాలను అర్థం చేసుకుని, తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడే నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కమిటీ సభ్యులు టి.ఎస్. వలి, పరుశురాముడు, ఐఎఫ్‌టీయూ నాయకులు రామాంజీ, నరసప్ప, రామచంద్ర, రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకుడు వెంకటేష్, యమన్న తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.