BREAKING
నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం న్యాయవాద పరిషత్‌ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్త సేవల అంతరాయంపై ట్రంప్ అధికారి వ్యంగ్యాస్త్రాలు: H-1B వీసా నియామకాలను ప్రస్తావిస్తూ విమర్శ నిరుద్యోగ మహిళలకు భరోసా -ఈ నెల 22న పెద్దపల్లిలో మహిళ ‘మెగా జాబ్ మేళా’ ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్య సాధన దిశగా భారత్ దూకుడు.. శీతాకాల సమావేశాల్లో ఎంఎస్ఎంఈ, లాజిస్టిక్స్ రంగాలపై తొలి ఇంటిగ్రేటెడ్ ఆడిట్ నివేదికలను ప్రవేశపెట్టనున్న కాగ్ నూతన అడ్వకేట్ బండారి రవికి ఘన సన్మానం... రైతులకు అండగా ఉంటాం మాజీ చైర్మన్ కాంటే కార్ మధుమోహన్ ఆసియాలో టాప్ రియల్ ఎస్టేట్ పెట్టుబడి గమ్యస్థానంగా అవతరించిన భారత్: 5.5 బిలియన్ డాలర్ల నిధుల ప్రవాహం భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: తుది అడ్డంకులపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర స్పందన ఆధునిక నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరోసిటీలో ఘనంగా ‘అవెనీర్–2026’ వార్షిక క్రీడోత్సవం మాక్ గ్రామ సభ నిర్వహించిన చిన్నారులకు బహుమతి అందజేసిన సర్పంచ్, ఉప సర్పంచ్ క్రమశిక్షణ పట్టుదల తో లక్ష్యాలు సాధించాలి నెహ్రూ ఘన నివాళి

మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలను అరికట్టాలి.. 1500 మందికి పైగా విద్యార్థినులతో ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ..

Select Suryaa Now
మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలను అరికట్టాలి..  1500 మందికి పైగా విద్యార్థినులతో ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ..

అనంతపురం విద్య మేజర్ న్యూస్ :-అనంతపురం నగరంలో రాప్తాడు ఘటన బాధితురాలికి సంఘీభావంగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలను అరికట్టాలని కోరుతూ ఆర్ట్స్ కళాశాల నుంచి సప్తగిరి కూడలి వరకు 1500 మందికి పైగా విద్యార్థినులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు.
ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి సావిత్రమ్మ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఓతూరు పరమేష్ మాట్లాడుతూ.. రాప్తాడు ఘటన అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గంజాయి, మద్యం, మాదకద్రవ్యాల వినియోగం పెరగడం వల్ల మహిళలు, చిన్నారులపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. మత్తు పదార్థాల సరఫరాను అరికట్టడంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాబుద్ధులు నేర్పే తరగతి గదుల్లోనూ చిన్నారులకు రక్షణ లేకపోవడం బాధాకరమన్నారు. ఆడపిల్లలు పట్టపగలు సైతం స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు మారాలని, ప్రజల్లో చైతన్యం కలిగించేలా ప్రభుత్వం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తరిమెల గిరి, బంగి శివ, భీమేష్, నవీన్, భూషణ్, సాయి, మహేష్, శ్రీనాథ్, ఐద్వా నాయకులు గీత, తులసి, ఇమం భీ, శైలజ, కుమారి తదితరులు పాల్గొన్నారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..