BREAKING
అక్షయ్ కుమార్‌ను ‘అనూప్ జలోటా’ అంటూ ఆటపట్టించిన ట్వింకిల్ ఖన్నా.. పారితోషికం లేకుండా కాఫీ విత్ కరణ్ షోకి వెళ్లావంటూ ఫన్నీ రోస్ట్! మాటలు చాలని చోట సంగీతమే మాట్లాడుతుంది పేద రోగికి ఉచితంగా మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స సీజేపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.. దీప్కే, రాంకా, సౌరవ్‌లకు లుకౌట్ నోటీసులు జారీ ఇఫ్ఫీ 2026లో మన శంకర వరప్రసాద్ గారు విశేషాలపై అనిల్ రావిపూడి వ్యాఖ్యలు బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో  ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు భాయ్ బంద్ సినిమాతో సోదరభావం, ఆధునికతపై ఆసక్తికర కథనం కురుమ యువ చైతన్య సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా ఎల్కపెల్లి రమేష్ నియామకం ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.. తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 15 రోజుల పితృత్వ సెలవులు మంజూరు డప్పు చాటింపుతో దీక్షా దివస్ సభకు ఆహ్వానం - మాజీ మంత్రి గంగుల కమలాకర్ డప్పు చాటింపుతో దీక్షా దివస్ సభకు ఆహ్వానం - మాజీ మంత్రి గంగుల కమలాకర్ బాప్యా సినిమాతో ఆమోదం, లింగ గుర్తింపుపై కొత్త చర్చ అమరవీరుడు కిష్టయ్య త్యాగం మరువలేనిది - వర్ధంతి పోస్టర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ కాశీ తమిళ సంగమం ఐదో ఎడిషన్ నవంబర్ 28న ప్రారంభం

మాల మహానాడు ఆధ్వర్యంలో 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు...!

Select Suryaa Now
మాల మహానాడు ఆధ్వర్యంలో 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు...!

మాల మహానాడు ఆధ్వర్యంలో 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు...!


నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్ -: నందికొట్కూరు తాలూకా మాల మహానాడు అధ్యక్షులు పబ్బతి శివ ప్రసాద్ ఆధ్వర్యంలో
77వ భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ నందు నందికొట్కూరు మాల మహానాడు నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు . ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షుడు శివప్రసాద్  మాట్లాడుతూ భారత రాజ్యాంగం రచించడానికి రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు కాలం పట్టిందని వివరించారు.రాజ్యాంగ రచనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే అన్ని దేశాల రాజ్యాంగాలను అన్నిటిని పరిశీలించి భారతదేశ ప్రజలకు దిశా నిర్దేశం చేసే రాజ్యాంగానికి రూపకల్పన చేశాడన్నారు .భారత రాజ్యాంగంలో ప్రజలందరికీ ,స్వేచ్ఛ సమానత్వము, లౌకితత్వము  మొదలైన అనేక హక్కులతో భారత రాజ్యాంగము రూపొందించారన్నారు.రాజ్యాంగాన్ని రూపొందించిన మహానేత నవభారత్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానానికి భారతదేశ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని అని తెలిపారు. భారతదేశ ప్రజలు ఆయన అడుగుజాడల్లో పయనించాలని ఆయన కలలుగన్న భారతదేశాన్ని నిర్మించాలని. కోరారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మాల మహానాడు తాలూకా ఉపాధ్యక్షుడు ఆరే.రాజు ,నందికొట్కూరు మాల మహానాడు నాయకులు నాగరాజు ,తమ్మడపల్లె ఫ్రాన్సిస్ ,బేతి జయన్న ,డక్క కుమార్ పాత్రికేయులు హుస్సేన్ ఆలం తదితరులు పాల్గొన్నారు.