BREAKING
సబ్‌టైటలింగ్ అనేది కేవలం అనువాదం కాదు, ఒక కళ బ్రిలియంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘బాల 369’ పెద్ద బ్లాక్‌బస్టర్ కావాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నిఖిల్ సిద్ధార్థ! గాంధీ భవన్‌కు చేరిన పెద్దపల్లి పంచాయితీ.. సందీప్ దీక్షిత్‌తో మంత్రి వివేక్ భేటీ.. మార్కాపురం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలి – ఆమ్ ఆద్మీ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు వి.సుదర్శన్ వేవ్స్ ఫిల్మ్ బజార్ 20వ ఎడిషన్ ఘనత గుమ్మగట్ట మండలం గొల్లపల్లి గ్రామ సర్పంచ్‌గా వైసీపీ అభ్యర్థి సావిత్రమ్మ ఘన విజయం!! మహిళా విద్య కోసం ఫూలే దంపతుల పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు ప్రతీక్ గాంధీ! రామాయణం చిత్ర బృందంతో అమిత్ షా భేటీ సత్యభామ కోణంలో శ్రీకృష్ణుడి జీవన గాథ కుందారపు రామారావు - పద్మావతి దంపతులు కుమార్తె వివాహ నిశ్చితార్థ వేడుకకు హాజరైన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ ఇఫ్ఫీ 2026లో టాగో వరల్డ్ ప్రీమియర్ వృషకర్మలో మునుపెన్నడూ చూడని విజువల్స్.. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునేలా ఉంటుందన్న నాగ చైతన్య! వృషకర్మలో మునుపెన్నడూ చూడని విజువల్స్.. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునేలా ఉంటుందన్న నాగ చైతన్య! ఎల్లూరులో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం ఒంగోలులో ఘనంగా మాగుంట సుబ్బరామన్నజయంతి వేడుకలు

అమరవీరుడు కిష్టయ్య త్యాగం మరువలేనిది - వర్ధంతి పోస్టర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్

Select Suryaa Now
అమరవీరుడు కిష్టయ్య త్యాగం మరువలేనిది - వర్ధంతి పోస్టర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్
సూర్య కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు పోలీస్ కిష్టయ్య త్యాగం చిరస్మరణీయమని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. డిసెంబర్ 1న నిర్వహించనున్న కిష్టయ్య 17వ వర్ధంతి కార్యక్రమ పోస్టర్‌ను తన నివాసంలో ముదిరాజ్ సంఘం ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిష్టయ్య, శ్రీకాంతాచారి వంటి అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ ప్రభుత్వం భూమి, ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు పిల్లల చదువుకు సహకరించిందని తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. డిసెంబర్ 1న నిర్వహించే వర్ధంతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని నివాళులర్పించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో గుర్రాల మల్లేశం ముదిరాజ్, పండుగ బాలు ముదిరాజ్, కొలక నర్సయ్య ముదిరాజ్, రాజ్‌కుమార్, శ్యామ్ ముదిరాజ్, మద్ది పవన్ ముదిరాజ్, భిక్షపతి, మల్లేశం, గుడెల్లుల పోచయ్య, కంకటి రాజారాం, శరత్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.