telangana
కురుమ యువ చైతన్య సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా ఎల్కపెల్లి రమేష్ నియామకం
సూర్య కరీంనగర్ : కురుమ యువ చైతన్య సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా ఎల్కపెల్లి రమేష్ నియమితులయ్యారు. కురుమ యువ చైతన్య సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కుండే వెంకటేష్ కురుమ ,రాష్ట్ర ఉపాధ్యక్షులు కేమిడి ఉపేందర్ కురుమ చేతుల మీదుగా ఎల్కపెల్లి రమేష్ కురుమ కి కరీంనగర్ జిల్లా అధ్యక్ష నియామక పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కురుమ యువ చైతన్య సమితి బలోపేతానికి, కురుమ యువతలో ఐక్యత, చైతన్యం పెంపొందించేందుకు నూతన జిల్లా అధ్యక్షులు రమేష్ కృషి చేయాలని, సమాజ అభివృద్ధి కోసం ముందుండి పనిచేయాలని సూచించారు. జిల్లాలో కురుమ జాతి ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం, కురుమ యువ చైతన్య సమితి బలోపేతానికి తగిన కృషి చేస్తానని జిల్లా అధ్యక్షులు రమేష్ తెలియజేశారు.