telangana
ఎల్లూరులో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
సూర్య, పెంచికల్‌పేట్:పెంచికల్‌పేట్ మండలంలోని ఎల్లూరు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని గురువారం రోజు సర్పంచులు చప్పిడి రవీందర్, షేక్ ఉస్మాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించుకోవాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుకిడే రాజేశ్వర్, సీసీ జ్యోతిరావు,ఐకేపీ సిబ్బంది, ఏఈఓ శ్రీవిద్య, నాయకులు చప్పిడే సత్యనారాయణ, రైతులు పాల్గొన్నారు.