సూర్య కరీంనగర్ : పేదలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా డాక్టర్ బి.ఎన్. రావు ఫౌండేషన్ మరో ఉచిత మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించింది. కోరుట్లకు చెందిన మ్యాక మల్లయ్యకు ఆదర్శ హాస్పిటల్‌లో డాక్టర్ అనీల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా ఎడమ మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స చేశారు. కోలుకోవడంతో గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ బి.ఎన్. రావు మాట్లాడుతూ ఇప్పటివరకు ఫౌండేషన్ ద్వారా 30 మందికి ఉచితంగా మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సేవలకు సహకరిస్తున్న ఆదర్శ హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ అనీల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఆర్థికంగా వెనుకబడిన వారికి వైద్య సహాయం అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి డాక్టర్ ఝాన్సీ, కోశాధికారి డాక్టర్ అలీం తదితరులు ఉన్నారు.