telangana
బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
సూర్య కరీంనగర్ : భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని, దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన మహోన్నత గ్రంథమని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బత్తుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గురు వారం కరీంనగర్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు.తొలుత స్థానిక విద్యుత్ ఎస్ఈ కార్యాలయం నుండి కోర్టు చౌరస్తా వరకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం కోర్టు చౌరస్తాలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులంతా కలిసి భారత రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివి వినిపించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, ఎస్సీ మోర్చా పదాధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ,డిప్యూటీ మేయర్ సునీల్ రావు జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జ శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షలు గుర్రాల వెంకట్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, కన్నబోయిన ఓదెలు, కార్పొరేటర్లు సోమిడి వేణుప్రసాద్, నాంపల్లి శ్రీనివాస్,మాసం గణేష్ టీంకు, వాసాల రమేష్, ఏన్నం ప్రకాష్., చంద్రశేఖర్, జోన్ అధ్యక్షులు జాడి బాల్ రెడ్డి, అవదుర్తి శ్రీనివాస్ , బండారు గాయత్రి , తనకు సాయి కృష్ణ ,నాయకులు అడిచర్ల రాజు, రాపాక ప్రవీణ్ బామండ్ల రాజు, ప్రశాంత్, శ్రీనివాస్,కళ్యాణ్, సురేష్, చందు, ఆనంద్, అరుణ్, సునంద్,రవిప్రసాద్, రాగూరు, రాకేష్, తిరుపతి, అనిల్, స్వామి తదితరులు పాల్గొన్నారు,,