telangana
8 లీటర్ల గుడుంబా స్వాధీనం.. ఇద్దరిపై కేసు నమోదు
సూర్య, పెంచికల్‌పేట్: అక్రమ గుడుంబా తయారీ, విక్రయాల నియంత్రణలో భాగంగా పెంచికల్‌పేట్ మండలంలోని ఆగర్ గూడ గ్రామంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి 8 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా తనిఖీలు చేపట్టగా గుడుంబా పట్టుబడిందనీ, ఈ వ్యవహారంలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.