సీజేపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.. దీప్కే, రాంకా, సౌరవ్‌లకు లుకౌట్ నోటీసులు జారీ
ముంబై: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కీలక నేతలకు ముంబై పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో పాటు సహ-కన్వీనర్లు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లపై పోలీసులు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్‌ఓసీ) జారీ చేశారు.
గత అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ముంబై దాదర్‌లోని శివాజీ పార్క్ వద్ద అనుమతి లేకుండా నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమం నేపథ్యంలో నమోదైన కేసులో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వేలాది మందితో ఆందోళన చేపట్టినందుకు వీరిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) కింద కేసులు నమోదయ్యాయి. నిందితులు విదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉందన్న అనుమానంతోనే లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా, ఈ లుకౌట్ నోటీసుల కారణంగానే ఇటీవల బ్రిటన్ వెళ్లేందుకు సిద్ధమైన సౌరవ్ దాస్‌ను ఢిల్లీ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకోగా, ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.