BREAKING
సబ్‌టైటలింగ్ అనేది కేవలం అనువాదం కాదు, ఒక కళ బ్రిలియంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘బాల 369’ పెద్ద బ్లాక్‌బస్టర్ కావాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నిఖిల్ సిద్ధార్థ! గాంధీ భవన్‌కు చేరిన పెద్దపల్లి పంచాయితీ.. సందీప్ దీక్షిత్‌తో మంత్రి వివేక్ భేటీ.. మార్కాపురం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలి – ఆమ్ ఆద్మీ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు వి.సుదర్శన్ వేవ్స్ ఫిల్మ్ బజార్ 20వ ఎడిషన్ ఘనత గుమ్మగట్ట మండలం గొల్లపల్లి గ్రామ సర్పంచ్‌గా వైసీపీ అభ్యర్థి సావిత్రమ్మ ఘన విజయం!! మహిళా విద్య కోసం ఫూలే దంపతుల పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు ప్రతీక్ గాంధీ! రామాయణం చిత్ర బృందంతో అమిత్ షా భేటీ సత్యభామ కోణంలో శ్రీకృష్ణుడి జీవన గాథ కుందారపు రామారావు - పద్మావతి దంపతులు కుమార్తె వివాహ నిశ్చితార్థ వేడుకకు హాజరైన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ ఇఫ్ఫీ 2026లో టాగో వరల్డ్ ప్రీమియర్ వృషకర్మలో మునుపెన్నడూ చూడని విజువల్స్.. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునేలా ఉంటుందన్న నాగ చైతన్య! వృషకర్మలో మునుపెన్నడూ చూడని విజువల్స్.. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునేలా ఉంటుందన్న నాగ చైతన్య! ఎల్లూరులో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం ఒంగోలులో ఘనంగా మాగుంట సుబ్బరామన్నజయంతి వేడుకలు

తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 15 రోజుల పితృత్వ సెలవులు మంజూరు

Select Suryaa Now
తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 15 రోజుల పితృత్వ సెలవులు మంజూరు

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం పురుష ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న పురుష ఉద్యోగులకు 15 రోజుల పాటు పితృత్వ సెలవులు (పెటర్నిటీ లీవ్) మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడులో పురుష ఉద్యోగులకు ఈ తరహా సదుపాయం కల్పించడం ఇదే తొలిసారి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. అర్హులైన పురుష ఉద్యోగులు బిడ్డ పుట్టడానికి 15 రోజుల ముందు నుంచి లేదా శిశువు జన్మించిన ఆరు నెలల్లోపు ఎప్పుడైనా ఈ 15 రోజుల సెలవులను వినియోగించుకోవచ్చు. ప్రసవ సమయంలో తల్లికి మానసిక, శారీరక తోడ్పాటు అందించడంతో పాటు నవజాత శిశువు సంరక్షణలో తండ్రి పాత్ర కీలకమనే ఉద్దేశంతో ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, తమిళనాడులో ఇప్పటికే మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు 365 రోజుల పాటు ప్రసూతి సెలవులు అమల్లో ఉన్నాయి.