BREAKING
సబ్‌టైటలింగ్ అనేది కేవలం అనువాదం కాదు, ఒక కళ బ్రిలియంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘బాల 369’ పెద్ద బ్లాక్‌బస్టర్ కావాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నిఖిల్ సిద్ధార్థ! గాంధీ భవన్‌కు చేరిన పెద్దపల్లి పంచాయితీ.. సందీప్ దీక్షిత్‌తో మంత్రి వివేక్ భేటీ.. మార్కాపురం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలి – ఆమ్ ఆద్మీ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు వి.సుదర్శన్ వేవ్స్ ఫిల్మ్ బజార్ 20వ ఎడిషన్ ఘనత గుమ్మగట్ట మండలం గొల్లపల్లి గ్రామ సర్పంచ్‌గా వైసీపీ అభ్యర్థి సావిత్రమ్మ ఘన విజయం!! మహిళా విద్య కోసం ఫూలే దంపతుల పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు ప్రతీక్ గాంధీ! రామాయణం చిత్ర బృందంతో అమిత్ షా భేటీ సత్యభామ కోణంలో శ్రీకృష్ణుడి జీవన గాథ కుందారపు రామారావు - పద్మావతి దంపతులు కుమార్తె వివాహ నిశ్చితార్థ వేడుకకు హాజరైన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ ఇఫ్ఫీ 2026లో టాగో వరల్డ్ ప్రీమియర్ వృషకర్మలో మునుపెన్నడూ చూడని విజువల్స్.. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునేలా ఉంటుందన్న నాగ చైతన్య! వృషకర్మలో మునుపెన్నడూ చూడని విజువల్స్.. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునేలా ఉంటుందన్న నాగ చైతన్య! ఎల్లూరులో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం ఒంగోలులో ఘనంగా మాగుంట సుబ్బరామన్నజయంతి వేడుకలు

మాటలు చాలని చోట సంగీతమే మాట్లాడుతుంది

Select Suryaa Now
మాటలు చాలని చోట సంగీతమే మాట్లాడుతుంది

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: మాటలు చాలని చోట సంగీతమే భావాలను వ్యక్తం చేస్తుందని ప్రముఖ నేపథ్య గాయని కె.ఎస్. చిత్ర అన్నారు. గోవాలో జరుగుతున్న 57వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, ఎస్. జానకి వంటి దిగ్గజ గాయనీమణులతో తనకున్న జ్ఞాపకాలు, సంగీత ప్రస్థానాన్ని ఆమె ప్రేక్షకులతో పంచుకున్నారు. ప్రముఖ నటి, దర్శకురాలు సుహాసిని మణిరత్నం వ్యాఖ్యాతగా జరిగిన ఈ ప్రత్యేక మాస్టర్‌క్లాస్‌లో చిత్ర తన బాల్య అనుభవాలు, సంగీత సాధన గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సంగీత వాతావరణంలో పెరిగిన తాను పోటీలలో పాల్గొంటూ, శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ ఎదిగానని, పాడటం తనకు బాగా వచ్చునని తెలిసినా ఇంత దూరం ప్రయాణిస్తానని ఎప్పుడూ ఊహించలేదని ఆమె పేర్కొన్నారు. క్లబ్‌లలో నిర్వహించే కార్యక్రమాలలో పాటలు పాడే సమయంలో తొలుత పి. సుశీల పాడిన గీతాలతోనే తన ప్రదర్శనలు ప్రారంభించేదానినని, ఆ విధంగా అనుకోకుండా సినీ సంగీత రంగంలోకి అడుగుపెట్టానని తెలిపారు.

తన సంగీత ప్రయాణంపై పి. సుశీల, ఎస్. జానకి, లతా మంగేష్కర్ ప్రభావం ఎంతో ఉందని చిత్ర చెప్పారు. చిన్నతనంలో జానకి గారి గానశైలిని అనుకరించేందుకు ప్రయత్నించేదానినని, అయితే ఆమె ప్రత్యేక శైలిని మరొకరు అందుకోవడం దాదాపు అసాధ్యమని సరదాగా వ్యాఖ్యానించారు. భక్తి గీతాలలో లతా మంగేష్కర్ పాటలు చూపే భావోద్వేగ లోతు అద్భుతమైనదని కొనియాడుతూ, ఆమెకు ఇష్టమైన గీతాన్ని సభలో ఆలపించి వినిపించారు. గజల్స్ సహా విభిన్న సంగీత ప్రక్రియలలో ఆశా భోంస్లే చూపిన వైవిధ్యం, ప్రయోగాత్మకత ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ ఒక గజల్‌ను పాడారు. లతా మంగేష్కర్‌తో పోలిక కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాలని ఆశా భోంస్లే ఎప్పుడూ కోరుకునేవారని, తొలిసారి కలిసినప్పుడు ఎందుకింత ఎత్తైన స్థాయిలో పాడుతున్నావని ఆమె సూటిగా అడిగిన ఆసక్తికర సంఘటనను చిత్ర గుర్తుచేసుకున్నారు.

ఎస్. జానకి గురించి మాట్లాడేటప్పుడు చిత్ర ఎంతో ఆప్యాయతతో భావోద్వేగానికి గురయ్యారు. తొలినాళ్లలో మిమిక్రీ కళాకారుల కార్యక్రమాల మధ్యలో జానకి పాడేవారని, ఆ పరిచయాలే ఆమెను నేపథ్య గాయనిగా నిలబెట్టాయని చెప్పారు. గాన రంగంలోనే కాకుండా తన జీవితంలో జానకి అమ్మలా నిలిచారని, ఆమె ఇంటికి వెళ్లినప్పుడు స్వయంగా చేతితో తినిపించేవారని, ఆమె చేతితో తింటే కారం కూడా తీయగానే ఉండేదని నాటి మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. సుహాసిని మధ్యమధ్యలో సినీ సన్నివేశాలు, భావోద్వేగాలను ప్రస్తావిస్తూ ప్రేమ, పెళ్లి, దుఃఖం, ఆనందం వంటి జీవితంలోని ప్రతి ఘట్టంలోనూ సంగీతం ఎలా తోడుగా నిలుస్తుందో వివరించారు. మలయాళ గీతం స్వర్ణముకిలే పాట విన్నప్పుడల్లా ఇప్పటికీ తన కళ్లలో నీళ్లు తిరుగుతాయని చిత్ర వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో నిర్వహించిన సరదా సంగీత క్విజ్‌లో నేపథ్య సంగీతం లేకుండా చూపిన ఐదు సినీ సన్నివేశాలకు సంబంధించిన పాటలను చిత్ర వెంటనే గుర్తించి పాడి సభికులను అలరించారు. వయసు పెరుగుతున్న కొద్దీ స్వర పరిమితులను గుర్తించడం, క్లిష్టమైన బాణీలను పాడటంలోని సవాళ్ల గురించి కూడా చర్చించారు. చివర్లో సింధు భైరవి చిత్రంలోని పాడరియెన్ గీతాన్ని చిత్ర పాడుతుండగా, సుహాసిని దానికి అనుగుణంగా హావభావాలు పలికించడం వేడుకకు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, ఎస్. జానకి గాత్ర మాధుర్యం తరతరాలుగా ప్రేక్షకుల జ్ఞాపకాలలో ఎలా నిలిచిపోతుందో ఈ మాస్టర్‌క్లాస్ మరోసారి చాటిచెప్పింది.