telangana
డప్పు చాటింపుతో దీక్షా దివస్ సభకు ఆహ్వానం - మాజీ మంత్రి గంగుల కమలాకర్
సూర్య కరీంనగర్ ప్రతినిధి : ఈ నెల 29న అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో డప్పు చాటింపు కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్వయంగా డప్పు కొట్టి ప్రజలకు సభకు ఆహ్వానం పలికారు.ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చారిత్రక మలుపుగా నిలిచిందన్నారు. దీక్షా దివస్ కేవలం పార్టీ కార్యక్రమం కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల చరిత్రకు సంబంధించిన వేడుక అని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులు, ఉద్యమకారులు, కవులు, మేధావుల సేవలను స్మరించుకోవాలని అన్నారు.ఈ నెల 29న మధ్యాహ్నం 3 గంటలకు అలుగునూరులో నిర్వహించే సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, కవులు, మేధావులను సన్మానించనున్నట్లు వెల్లడించారు. ప్రజలంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.