మాజీ సీఎం వైఎస్ జగన్ బీసీల ఆత్మ గౌరవాన్ని పెంచారు... వైసిపి రాష్ట్ర ఆర్టిఐ కార్యదర్శి బడుగు బాలాజీ
ఉండి, మేజర్ న్యూస్: వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల ఆత్మగౌరవాన్ని పెంచారని వైసీపీ ఆర్టిఐ రాష్ట్ర కార్యదర్శి బడుగు బాలాజీ అన్నారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే జీవోలు, కోర్టు తీర్పులతో సంబంధం లేకుండా స్థానిక ఎన్నికల్లో సీట్లు కేటాయించవచ్చని సుప్రీంకోర్టుతీర్పుని బూచిగా చూపించి స్థానిక ఎన్నికల్లో 25% ఇచ్చే విధంగా క్యాబినేట్ తీర్మానాలు బీసీలను మోసం చేయడం మానుకోవాలని బాలాజీ హితవు పలికారు. కూటమి ప్రభుత్వం ఎంపీటీసీ లకు 25.55% తీర్మానిస్తే జగన్ ప్రభుత్వంలో 661 ఎంపీపీలలో 449 అనగా 68%,జగన్ ఇస్తే , చంద్రబాబు 24%, 661జడ్పీటీసీలకుగాను 237 అనగా 36%, జగన్మోహన్ రెడ్డి ఇస్తే, చంద్రబాబు 24% , 13 జడ్పీ ఛైర్మన్ లకు 6 అంటే 46% జగన్ ఇస్తే, చంద్రబాబు 24%, మేయర్లు13 గాను 9 అంటే 69% జగన్ ఇస్తే, చంద్రబాబు 22%, మున్సిపల్ చైర్మన్ లలో 53% జగన్ ఇస్తే చంద్రబాబు 33%, బీసీలకు ఇవ్వాలని తీర్మానించడం బీసీలను వెన్నుపోటు పొడవడం కాదా బాలాజీ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సగటునా 52% బీసీలకు కేటాయించారని, అంతే కాకుండా 11 రాజ్యసభ ఎంపీలకు 4 అంటే 36%, 25 లోక్ సభ సీట్లకుగాను 11 అంటే44%, ఎమ్మెల్సీలలో 48% బీసీలకు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చి బీసీలకు సామాజిక గౌరవం పెంచడంలో రాష్ట్ర చరిత్రలో ఎవ్వరూ చెయ్యలేనంత మేలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేశారని బాలజీ స్పష్టం చేశారు.చంద్రబాబు పవన్ లకు చిత్తశుద్ధి ఉంటే పార్టీపరంగా 50% స్థానాలను బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఈతకోట రాజు రిపోర్టర్ ఉండి, పశ్చిమగోదావరి జిల్లా.