మాజీ సర్పంచ్ మునుకోలుకు శ్రీనివాసరాజు పరామర్శ
ఉండి, మేజర్ న్యూస్: ఎన్ ఆర్ పి అగ్రహారం మాజీ సర్పంచ్, వైసీపీ సీనియర్ నాయకుడు మునుకోలు సింహాచలం కుటుంబ సభ్యులను వైసిపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు, క్షత్రియ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇటీవల కాలంలో మాజీ సర్పంచ్ సింహాచలం సోదరుడు మహేశ్వరరావు అకాల మరణం చెందియున్నారు కార్యకర్తల ద్వారా విషయం తెలుసుకున్న క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస రాజు సింహాచలం నివాసానికి వెళ్లి మహేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. పార్టీ అండగా ఉంటుందని ధైర్యంగా ఉండాలని ఆయన కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అంగర రాంబాబు, శేషాద్రి శ్రీనివాస్, గల్లావల్లి ధనుంజయ, రాయి సతీష్, రావూరి గ్రేస్, బురిడీ వీర్రాజు, దొంగ వెంకటేష్, బురిడీ కేశవ, సిపిఎం సీనియర్ నాయకుడు బురిడీ వాసుదేవరావు తో పాటు స్థానిక వైసీపీ నాయకులు తదితరులు సింహాచలం కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో ఉన్నారు.
ఈతకోట రాజు రిపోర్టర్ ఉండి పశ్చిమగోదావరి జిల్లా