లబ్ధిదారులకు సీఎం రిలీఫ్.చెక్కులు పంపిణీ
సంతనూతలపాడు, మేజర్ న్యూస్:
ఒంగోలులోని బృందావనం ఫంక్షన్ హాల్ నందు ఆదివారం సాయంత్రం జరిగిన సీ.ఎం.ఆర్.ఎఫ్. మహోత్సవ వేడుకల్లో సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని 92 మంది లబ్ధిదారులకు 45 లక్షల 64 వేల రూపాయలు విలువ చేసే సీఎం రిలీఫ్ చెక్కులను సంతనూతలపాడు శాసనసభ్యులు బి .ఎన్. విజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయకుమార్ మాట్లాడుతూ పేద వర్గాలకు వైద్యం నిమిత్తం సీఎం. రిలీఫ్ చెక్కులు పంపిణీ చేయడం ఎంతో వరమని ఎమ్మెల్యే విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి శ్రేణులు, లబ్ధిదారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.