BREAKING
జబర్దస్త్ శ్రీవిద్య సంచలన వ్యాఖ్యలు.. కెరీర్ ప్రారంభంలో పడిన కష్టాలు, వైరల్ ఫేమ్ వెనుక అసలు నిజాలు వృత్తి విద్యా ఉపాధ్యాయులకు మూడు రోజుల కౌశల్ బోధ్ శిక్షణ స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం.. వత్సవాయి మండలంలో రెండో విడతకు గ్రామ పంచాయతీ ఎన్నికలు నవంబర్ 29న పోలింగ్.. 18 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ అసత్య ఆరోపణలు వ్యక్తిగత విమర్శలు కాదు.. అభివృద్ధిపై చర్చకు రండి ఎమ్మెల్యే సంజీవరెడ్డి కి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సవాల్ నయనతారపై టాలీవుడ్ డైరెక్టర్ మారుతి సంచలన వ్యాఖ్యలు.. ఆ స్టార్ హీరోయిన్‌కు అంత పొగరా? విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను తొలగించండి తీపర్రు ఎంపీటీసీ కరటూరి సుబ్బారావుకు బూరుగుపల్లి శేషారావు అభినందనలు దివ్యాంగుల సమస్యలు పరిష్కరించకుంటే మరో ఉద్యమం మృత్యువుకే ఎదురెళ్ళి గెలిచిన వీరనారీమణులు.. క్యాన్సర్‌ను జయించి స్ఫూర్తిగా నిలిచిన హీరోయిన్స్ సొంత పార్టీ ఎంపీ కార్యక్రమానికి వెళ్తే సస్పెండ్ చేస్తారా? ఏకపక్ష సస్పెన్షన్‌ను వెంటనే రద్దు చేయాలి జీబీఆర్‌లో క్రీడా సందడి.. విద్యార్థుల్లో ఉత్సాహం. సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ నైజాం రైట్స్ సంచలనం.. రూ.35 కోట్ల భారీ డీల్‌ను దక్కించుకున్న ఏషియన్ సినిమాస్! కరువు రైతులకు రుణ ఉపశమనం కల్పించాలి! బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి..జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్ సూచనలు

క్రీడా పోటీలలో విద్యార్థులు ప్రతిభ

Select Suryaa Now
క్రీడా పోటీలలో విద్యార్థులు ప్రతిభ

రాజ్యాంగ దినోత్సవం పోటీలలో కాలింగి విద్యార్థులు ప్రతిభ.
 
తిరుపతి జిల్లా సత్తి వేడు నియోజకవర్గం   సత్యవేడు పట్టణంలో నియోజకవర్గ స్థాయి రాజ్యాంగ దినోత్సవం పోటీలు ఘనంగా నిర్వహించారు. సత్యవేడు నియోజకవర్గ పరిధిలో వివిధ మండలాలకు చెందిన ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
 
ఈ పోటీల్లో కేవీబీపురం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కాలంగి విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ బహుమతులను కైవసం చేసుకున్నారు.
 ప్రథమ బహుమతి: కె. ప్రశాంతి, 9వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కాలంగి. ద్వితీయ బహుమతి: పి. లోకేష్, 9వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కాలంగి.
ఈ కార్యక్రమాన్ని సత్యవేడు మండలం విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించారు.  వివిధ పాఠశాలల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
నియోజకవర్గ స్థాయిలో జరిగిన పోటీల్లో కేవీబీపురం మండలానికి చెందిన కాలంగి పాఠశాల విద్యార్థులు ప్రథమ, ద్వితీయ స్థానాలను సాధించడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. విజేతలను ప్రత్యేకంగా అభినందించారు.
విద్యార్థుల్లో భారత రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి, పౌర హక్కులు, విధులు మరియు బాధ్యతల పట్ల అవగాహన పెంపొందించడానికి ఇటువంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి