కొత్తమ్మతల్లి ఉత్సవాలకు మంత్రి అచ్చెన్నాయుడుకి ఆహ్వానం
కోటబొమ్మాళి ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు కోటబొమ్మాళిలో కొలువైయున్న శ్రీ కొత్తమ్మతల్లి అమ్మవారి ఉత్సవ మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్న నేపధ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును ఆలయ ఈవో వి. రాధాకృష్ణ ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం వరుసగా రాష్ట్రస్థాయి ఉత్సవాలను నిర్వహిస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కోరాడ గోవిందరావు, ఇతర ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.