ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై సమీక్ష.. పంట కోత ప్రయోగాలపై శిక్షణ
బాడంగి, సూర్య: బాడంగి మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఖరీఫ్ 2026 ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని తహసీల్దార్ కె.వరప్రసాద్, మండల వ్యవసాయ అధికారి జి.సూర్యప్రకాష్ సూచించారు. ఈ సమావేశంలో గ్రామ రెవెన్యూ అధికారులు, వ్యవసాయ సిబ్బంది, రైస్ మిల్లర్లకు పంట కోత ప్రయోగాలపై శిక్షణ ఇచ్చారు. మండలంలోని 29 రెవెన్యూ గ్రామాల్లో 64 పంట కోత ప్రయోగాలు నిర్వహించేందుకు నిర్ణయించామని, వాటిని నిర్దేశిత సమయంలో తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులు తెలిపారు.