BREAKING
క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ప్రజల్లో అవగాహన పెంచాలి బీసీల రాజకీయ సాధికారతకు, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది యాక్షన్ మోడ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్.. 'డ్రాగన్' కొత్త షెడ్యూల్ ప్రారంభం! లిటిల్ ఫ్లాక్ లో ఘనంగా కృతజ్ఞతార్పణ పండుగ బిగ్‌బాస్‌లో ఊహించని ట్విస్ట్.. అపూర్వ ఎలిమినేషన్ తో బట్టబయలైన హౌస్‌మేట్స్ అసలు నైజం! కోటిపల్లిలో పర్యటించిన ఐజీ అశోక్ కుమార్ అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య అన్నవరప్పాడు శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్ శంకర్‌పల్లి, మోకిల పీఏసీఎస్‌లకు కొత్త పాలక మండళ్లు పర్యావరణ పరిరక్షణలో సేవలకు పుడమి నాయకులకు ప్రశంసలు పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ నేరేడుచర్ల విద్యార్థులకు ప్రశంసా పత్రాల ప్రదానం చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో వైభవంగా ప్రారంభం అయిన శ్రీ దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు. రోడ్లతోనే గ్రామీణాభివృద్ధి.. గ్రామమే దేశానికి మూల నిధి. 84 ఏళ్ల వయసులో రూ.4వేల కోట్ల సామ్రాజ్యం.. అమితాబ్ బచ్చన్ సక్సెస్ జర్నీ! మమితా బైజు క్రేజ్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో గోల్డెన్ బ్యూటీ ఎంట్రీ! గణేశ్ ఆచార్య బయోపిక్ 'గణేశ్: డస్ట్ టు స్టార్‌డస్ట్'.. ట్రైలర్ విడుదల, రిలీజ్ డేట్ ఖరారు!

కేతగుడిపిలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ.. టీడీపీలోకి 45 కుటుంబాలు!*

Select Suryaa Now
కేతగుడిపిలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ.. టీడీపీలోకి 45 కుటుంబాలు!*

తర్లుపాడు: మేజర్ న్యూస్ :

మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం కేతగుడిపి గ్రామంలో వైఎస్సార్‌సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన(45)కుటుంబాలువైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన 45 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి.

మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సోదరుడు, టీడీపీ నియోజకవర్గ పోల్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌చార్జి కందుల రామిరెడ్డి సమక్షంలో ఈ చేరికలు ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

 డీజేల హోరు.. పూలవర్షంతో ఘన స్వాగతంకేతగుడిపి గ్రామానికి విచ్చేసిన టీడీపీ నియోజకవర్గ పోల్‌మేనేజ్‌మెంట్‌ ఇన్‌చార్జి కందుల రామిరెడ్డికి స్థానిక శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. డీజేల హోరు మధ్య యువకులు కేరింతలు కొడుతూ, ఆయనపై పూలవర్షం కురిపించారు. మహిళలు మంగళహారతులతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పార్టీలోకి కొత్తగా చేరిన ప్రతి ఒక్కరికీ కందుల రామిరెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

**అభివృద్ధే మా ధ్యేయం: కందుల రామిరెడ్డి**

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కందుల రామిరెడ్డి మాట్లాడుతూ.. మార్కాపురం ప్రాంతంలో సాగునీటి వసతులు మెరుగుపడితే రైతాంగానికి ఎంతోప్రయోజనంచేకూరుతుందన్నారు. హార్టికల్చర్‌ హబ్‌ ఏర్పాటు ద్వారా ఉద్యాన పంటల సాగుకు, రైతుల ఆదాయ వృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, సుమారు రూ.1,260 కోట్ల వ్యయంతో 30 మండలాల్లో ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించే కార్యక్రమాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రాంత అభివృద్ధికి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

 **టీడీపీలోచేరినప్రముఖులు*

పార్టీలో చేరిన వారిలో పెరిక బోస్‌, పెరిక రమేష్‌, పెరిక ప్రభుదాసు, పెరిక హనకు, పెరిక కోటయ్య, పెరిక పెద్దకోటయ్య, పెరిక చిన్నకోటయ్య, పెరిక బాలకోటయ్య, పెరిక యోబు, పెరిక వెంకటకోటయ్య, పులికూరి యాకోబు, పులికూరి పెద్దకోటయ్య, పులికూరి చిన్నకోటయ్య, పెరిక బూస్టర్‌బాబు, పెరిక జాను, పెరిక చిన్నఏసు, పెరిక పెద్దఏసు, పెరిక కిషోర్‌బాబు, బేతం చిన్నచిరిపాలు, బేతం లక్ష్మయ్య, పెరిక విజయ్‌, పెరిక ఉదయ్‌, బేతం చిన్న, గుడిమెట్ల దానియేలు, బేతం చిన్నదాసు, బేతం కొండలు, బేతం ఇమ్మానుయేల్‌, బేతం ఇర్మియా, బేతం సాల్మన్‌, డోలు జార్జి, బేతం ఏసేబు, బేతం జాను, కటికల ప్రసాదు, పులికూరి సంతోష్‌, గాలిమట్టి పాపయ్య, బేతం నాగమ్మ, బేతం క్రిస్టఫర్‌, పులికూరి రాంబాబు, కటికల రవి, గాలిముట్టి మట్టయ్య, పులికూరి చిన్న యాకోబు, అటికల గురవయ్య, కటికల ప్రభుదాసు, బేతం పవన్‌, బేతం గురవయ్య, గాలిముట్టి జోర్జె తదితరులు ఉన్నారు.

 **పాల్గొన్న ప్రముఖ నాయకులు**

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రావి భాషాపతి రెడ్డి, యువ నాయకులు కందుల రోహిత్‌రెడ్డి, రావి కపిల్‌రెడ్డి, కమ్మ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పి. గోపీనాథ్‌ చౌదరి, మాజీ ఎంపీపీ పులివేముల ఏసుదాసు, కేతగుడి గ్రామ టీడీపీ నాయకులు నంద్యాల కాశయ్య, పెరిక ఓబయ్య, బేతం పిచ్చయ్య, పెరిక రమేష్‌, వేసపోగు జాన్‌, మోర వెంకటరెడ్డి, కాలంగిశ్రీనివాసులు, మేకలవెంకట్‌,నాగతిరుపతయ్య, వెంకటరెడ్డి, బొంబాయి వలీ, కోటపాటి వెంకట్‌రెడ్డి, గోసు వెంకటేశ్వర్లు, దొడ్డ సుబ్బారెడ్డి, డాక్టర్‌ సయ్యద్‌ మహబూబ్‌ వలీ, నంబూల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.