BREAKING
లీజుకు తీసుకున్న బస్సులు అమ్ముకున్నారని ఆరోపణ.. బాధితులకు న్యాయం చేయాలి అంటున్న నల్లి రాజేష్.* అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్.. కానీ మెగాస్టార్ చిరంజీవితో మాత్రం నటించని స్టార్ హీరోయిన్ కార్మికుల కొరత పరిష్కారానికి లావోస్ తీవ్ర కసరత్తు: స్వర్ణాంధ్ర కాలేజి ని సందర్శించిన నాక్ ఈసీ కమిటీ చైర్మన్ ఆచార్య నాగేశ్వరరావు రూ. 8 కోట్ల రెమ్యునరేషన్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి.. ఏమన్నారంటే? ఉత్తర కొరియా ముప్పుపై దక్షిణ కొరియా, జపాన్ రక్షణ శాఖల కీలక భేటీ: రూ.248 కోట్లతో నర్సీపట్నం మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి! రూ.3 కోట్లతో వాకింగ్ ట్రాక్, కళ్యాణ మండపం పనులకు శ్రీకారం : స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇథియోపియా నేషనల్ ప్యాలెస్, మ్యూజియంను సందర్శించిన విదేశాంగ మంత్రి జైశంకర్ బీసీలకు టీడీపీ అండగా ఉంటుంది బుడా చైర్మన్‌ తెంటు లక్ష్మునాయుడు గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ బాలిక దినోత్సవం శీనయ్యకు..జిల్లా పెద్ద బాధ్యతలు..! కోట్యాడ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయుడు రంభ వెంకట రమణకు సన్మానం ఉపాధి పనులు వేగవంతం చేయాలి ప్రజాదర్బార్‌కు విశేష స్పందన.. స్వీకరించిన ప్రతి ఫిర్యాదు పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి -- జెసి కె.ఆర్. కల్పశ్రీ, విప్ నాయకర్

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా ముఖ్యమంత్రి పర్యటన:

Select Suryaa Now
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా  ముఖ్యమంత్రి పర్యటన:

 జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు*

*ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు విధులు సమర్థవంతంగా నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బందికి అభినంధించిన జిల్లా ఎస్పీ గారు*

మీ భూమి – మీ హక్కు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ నిమిత్తం గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా, జరుగుమల్లి మండలం, నర్సింగోలు గ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఐపీఎస్., గారు, జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు హెలిప్యాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, పటిష్ట బందోబస్తు విధులపై పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.

ముఖ్యమంత్రి గారి పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్, వీఐపీ రూట్, రచ్చబండ, ప్రజావేదిక, పార్కింగ్ ప్రాంతాలను గుంటూరు రేంజ్ ఐజీ గారు, జిల్లా ఎస్పీ గారు క్షేత్రస్థాయిలో సందర్శించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు ప్రణాళికతో బందోబస్తు నిర్వహించేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి గారు హెలిప్యాడ్ నుంచి రచ్చబండ, ప్రజావేదిక కార్యక్రమాల్లో పాల్గొని, అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశంలో పాల్గొని పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, సమన్వయంతో కూడిన విధులతో గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. బందోబస్తు నిర్వహణలో ప్రజావేదిక, రూట్, ట్రాఫిక్ విభాగాలతో పాటు వివిధ బాధ్యతలు నిర్వర్తించిన పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారన్నారు.

పటిష్టమైన ముందస్తు ప్రణాళిక, సమర్థవంతమైన విధుల నిర్వహణ, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉంటే ఎలాంటి కార్యక్రమాన్నైనా సజావుగా నిర్వహించవచ్చని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించారు. బందోబస్తు విధులకు సహకరించిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.