కారుణ్య నియామకంలో పబ్లిక్ హెల్త్ వర్కర్లుగా విధుల కేటాయింపు
కారుణ్య నియామకంలో పబ్లిక్ హెల్త్ వర్కర్లుగా విధుల కేటాయింపు
నెల్లూరు నగర పాలక సంస్థ ఎస్టాబ్లిష్మెంట్ విభాగంలో అటెండర్, పబ్లిక్ హెల్త్ విభాగంలో వర్కర్ గా విధులు నిర్వహిస్తూ మరణించిన దార్ల మల్లి, ఇత్తడి రమేష్ ల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా కారుణ్య నియామకం ద్వారా వారి కుటుంబ సభ్యులు దార్ల కళ భర్త లేట్ మల్లి ఇత్తడి సతీష్ తండ్రి లేట్ రమేష్ లకు పబ్లిక్ హెల్త్ వర్కర్లుగా విధులను కేటాయిస్తూ ఉత్తర్వులను గౌరవ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అందజేశారు.
కార్పొరేషన్ కార్యాలయం మేయర్ ఛాంబర్ లో శుక్రవారం కారుణ్య నియామకం పత్రాలను వారు మేయర్ నుంచి అందుకున్నారు.
విధుల నిర్వహణలో క్రమశిక్షణ ప్రదర్శిస్తూ, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని మేయర్ వారికి సూచించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ మేనేజర్ రాజేశ్వరి, పబ్లిక్ హెల్త్ విభాగం సూపరింటెండెంట్ విజయ పాల్గొన్నారు.