BREAKING
వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ!

కారు సీటు కింద రూ.8.98 కోట్ల విలువైన బంగారం.. ఇద్దరు అరెస్ట్!

Select Suryaa Now
కారు సీటు కింద రూ.8.98 కోట్ల విలువైన బంగారం.. ఇద్దరు అరెస్ట్!

విశాఖపట్నం: భారీగా అక్రమంగా తరలిస్తున్న విదేశీ బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఓ కారులో సీటు కింద దాచిన 5,832.90 గ్రాముల విదేశీ బంగారం అధికారుల తనిఖీల్లో బయటపడింది.

మార్కెట్ విలువ ప్రకారం ఈ బంగారం విలువ సుమారు రూ.8.98 కోట్లు ఉంటుందని అధికారులు గుర్తించారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానించిన డీఆర్ఐ అధికారులు కారును వెంబడించి పట్టుకున్నారు.కారును పరిశీలించిన అధికారులు సీటు కింద దాచిన బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసిన అధికారులు, వారిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.

కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు బంగారం ఎలా తరలిస్తున్నారు? దీని వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.భారీ మొత్తంలో విదేశీ బంగారం పట్టుబడటంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.