కార్మికులకు బట్టలు అందజేసిన కార్పొరేటర్ బ్యాంకు శాంతమ్మ
తిరుపతి, మేజర్ న్యూస్:
దీపావళి పండుగను పురస్కరించుకొని 56వ డివిజన్ పరిధిలోని 20 మంది పారిశుద్ధ్యపు కార్మికులకు ఆ డివిజన్ కార్పొరేటర్ బ్యాంకు శాంతమ్మ కొత్త బట్టలను పంపిణీ చేశారు. వారందరికీ స్వీట్ బాక్స్లను పంపిణీ చేయడంతో పాటు బట్టలను పంపిణీ చేయడంతో వారందరూ కార్పొరేటర్ బ్యాంకు శాంతమ్మకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో బ్యాంకు శాంతమ్మ మాట్లాడుతూ 56 డివిజన్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులందరినీ తన కుటుంబ సభ్యులు లాగా భావించి వారికి కొత్త బట్టలు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. 56వ డివిజన్ పరిధిలో అన్ని వీధులలో పరిశుభ్రంగా ఉంచడంతోపాటు ఎక్కడ ఏ సమస్య ఉన్నా మొదట తెలియజేసేది కార్మికులే కాబట్టి వారికి గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీపావళి పండుగ నాడు వారికి బట్టలను పంపిణీ చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఇక రాబోయే రోజులలో కూడా ప్రతి ఏటా దీపావళి పండుగను పురస్కరించుకొని నా డివిజన్లో పనిచేసే కార్మికులందరికీ బట్టలను పంపిణీ చేయడంతో పాటు వారికి కావలసిన సహకారం అందించేందుకు ముందు ఉంటానని ఆమె పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు మహిళా సంఘాల ప్రతినిధులు బ్యాంకు శాంతమ్మను కలసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
H. Dwaraka, staff reporter
9705347341.