జిల్లాలో ఘనంగా ముగిసిన ఆక్వాఎక్స్ పో రైతులను ఆకట్టుకున్న ఆక్వా గ్రాండ్ వారి ఉత్పత్తులు
ఉండి, సూర్య న్యూస్: గత మూడు రోజులుగా రాధాకృష్ణ ఫంక్షన్ హాల్ లో ఆక్వా ఎక్స్పో ఫౌండర్ అండ్ చైర్మన్ దంతులూరి వేణు ఆధ్వర్యంలో జరుగుతున్న ఆక్వా ఎక్స్పో శనివారంతో ముగిసింది. ఆక్వా ఎక్స్పో నిర్వహణ పట్ల పాల్గొన్న పలువురు రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఆక్వా ఎక్స్పోలో సాగులో తీసుకోవలసిన మెలుకువలు నేర్చుకున్నామని తక్కువ ఖర్చుతో ఆక్వా సాగు ఏ విధంగా చేయాలి ఏ విధంగా లాభాలు గడించాలి అనే విషయాలు శాస్త్రవేత్తలు ఆక్వా ఎక్స్పో ప్రతినిధులు చక్కగా వివరించడం జరిగిందని వారు అన్నారు. మరి ముఖ్యంగా ఈ ఎక్స్ పోలో ఏర్పాటుచేసిన ఆక్వా గ్రాండ్ తమను ఎంతగానో ఆకట్టుకుందని ఆక్వా గ్రాండ్ దాదాపు 40 రకాల పైబడి ఉత్పత్తులను ఈ కార్యక్రమంలో ప్రదర్శించడం జరిగిందని ఆక్వా గ్రాండ్ ప్రతినిధులు వాటిని ఎలా వినియోగించాలి ఎలా వినియోగిస్తే ఏం ఉపయోగాలు ఉంటాయి అనే విషయాలు చక్కగా వివరించడం జరిగిందని గతంలో వాటి వినియోగం తెలియక చాలా నష్టపోయామని వాటిని ఎలా వినియోగించాలో ఆక్వా గ్రాండ్ ప్రతినిధులు రైతులకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగిందని పలువురు రైతులు సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు నష్టాల్లో ఉన్న ఆక్వా రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రభుత్వాలు ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు చేయాలని వారు అన్నారు. నిర్వాహకులు రైతులకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో సఫలీకృతులయ్యారని వారు తెలిపారు. ప్రతి షాప్ లోను ప్రతినిధులు శాస్త్రవేత్తలు ఆక్వా ఉత్పత్తులను వివరించిన తీరు అమోఘమని వారన్నారు.
ఈతకోట రాజు. రిపోర్టర్ ఉండి పశ్చిమగోదావరి జిల్లా