జర్నలిస్టు సద్గుణరావు ను పరామర్శించిన మండలి
అవనిగడ్డ, మేజర్ న్యూస్: ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స అనంతరం ఇంటి వద్ద కోలుకుంటున్న మచిలీపట్నం 10టీవీ జర్నలిస్ట్ పెనుమాక సద్గుణరావును జనసేన పార్టీ నాయకులు మండలి వెంకట్రామ్ పరామర్శించారు. శనివారం చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ రామానగరంలోని సద్గుణరావు స్వగృహానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మండలి ఉదయ భాస్కర్, సొసైటీ చైర్మన్ పరుచూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.