జనగణన–2027 ఏర్పాట్లపై రాష్ట్రస్థాయి సమావేశం
భీమవరం, అక్టోబర్ 9: జనగణన–2027 రెండో దశలో నిర్వహించనున్న జనాభా లెక్కింపునకు సంబంధించి సన్నద్ధత, ముందస్తు ఏర్పాట్లపై శుక్రవారం అమరావతిలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ చదలవాడ నాగరాణి ప్రిన్సిపల్ సెన్సస్ అధికారిగా హాజరయ్యారు.ఆంధ్రప్రదేశ్ సచివాలయం బ్లాక్–5లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జనాభా లెక్కింపునకు సంబంధించి రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ, అధికారుల భాగస్వామ్యం, శాఖల మధ్య సమన్వయం, ముందస్తు సన్నద్ధతపై మార్గదర్శకాలు అందించారు.
రిపోర్టర్ శ్రీనివాస్ భీమవరం పశ్చిమగోదావరి జిల్లా