BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

జనావాసాల మధ్య ఇటుక బట్టీలను నిలిపివెయ్యాలి.. సిపిఐ

Select Suryaa Now
జనావాసాల మధ్య ఇటుక బట్టీలను నిలిపివెయ్యాలి.. సిపిఐ

 

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి

పట్టణంలోని ఎల్లమ్మ బీడు కాలనీ సమీపంలో ఏర్పాటు చేయనున్న ఇటుక బట్టీని తక్షణమే నిలిపివేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సీపీఐ పట్టణ కార్యదర్శి జి. రంగన్న డిమాండ్ చేశారు. ఆదివారం కాలనీ ప్రజలతో కలిసి ఇటుక బట్టీ ఏర్పాటును ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా రంగన్న, భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ, జనావాసాలకు సుమారు 50 మీటర్ల దూరంలో ఇటుక బట్టీ ఏర్పాటు చేయడం వల్ల పొగ, దుమ్ము, కాలుష్యంతో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని అధికారులు అనుమతులపై పునఃపరిశీలన చేయాలని కోరారు.
జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి స్పందించి ఇటుక బట్టీ ఏర్పాటును నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో కాలనీ ప్రజలతో కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు బజారి, నరసింహులు, నాగరాజు, రాజు, మధు, గజేంద్ర, ఎల్లప్ప తదితరులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.