జలుమూరు మండల పేజ్ 3 పిఓలకు శిక్షణ..
జలుమూరు నవంబర్ 29 మేజర్ న్యూస్ : ఫేజ్–3 పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం జలుమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించారు. మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్ నందిగాం రాజగోపాల్ ఎన్నికల విధులు, నియమ నిబంధనలపై అధికారులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల నియమావళిని పూర్తిస్థాయిలో అవగాహన చేసుకుని, నిబంధనల ప్రకారం పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో బి. చిన్నమ్మడు, స్పెషల్ ఆఫీసర్ జయంతి ప్రసాద్, ఎంఈవోలు మాధవరావు, ప్రసాదరావు పాల్గొన్నారు.