BREAKING
మున్నూరు కాపు  పటేల్స్ సంఘం ఎన్నికల రాష్ట్ర కోఆర్డినేటర్ గా కాస రాజు పటేల్ నియామకం కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం కోటి 23 లక్షలు. పోక్సో చట్టంపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ రక్తదాన శిబిరం కార్యాక్రమం నిర్వహించిన పోలీస్ కమిషనర్... ఎయిడ్స్ నియంత్రణలో కామారెడ్డి జిల్లా బేష్ కలెక్టర్ ను అభినందించిన కేంద్రం మాధవనగర్ ఆర్వోబి పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలుకు తీవ్ర ఇబ్బందులు జిల్లాలో క్షయ వ్యాధిని నిర్మూలించాలి జిల్లా కలెక్టర్ కె.హరిత నువ్వూరుపాడు సెగ్మెంట్ అభివృద్ధి లక్ష్యం 21వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా జనసేన అభ్యర్థి వరలక్ష్మి ఇండో–శ్రీలంక మైత్రి సేతు సైకిల్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. గంజాయి సాగు, రవాణాను అరికట్టాలి జిల్లా కలెక్టర్ కె.హరిత భారీ సెటిల్‌మెంట్‌ కింద 220 మిలియన్ డాలర్లు చెల్లించనున్న ఆటోమొబైల్ దిగ్గజం జీఎం! జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించాలి... జిల్లా కలెక్టర్ కె.హరిత ఆదరించండి సెగ్మెంట్ అభివృద్ధికి కట్టుబడి ఉంటాం.

జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థికే నా మద్దతు

Select Suryaa Now
జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థికే నా మద్దతు

భోగాపురం, సూర్య :  భోగాపురం మండల జడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసినప్పటికీ, అనివార్య కారణాల వల్ల నామినేషన్‌ను ఉపసంహరించు కోలేకపోయానని జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, వ్యాపారవేత్త చెల్లుబోయిన నర్సింగరావు తెలిపారు. గురువారం సాయంత్రం కొత్త మరడపాలెంలోని తన నివాసం వద్ద నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌, ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఆదేశాల మేరకు కూటమి బలపరిచిన జడ్పీటీసీ అభ్యర్థి కర్రోతు చంద్రకళకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల అధికారులు తనకు ఎయిర్ కండిసనర్ (ఏసి)‌ గుర్తును కేటాయించారని, అయితే ఓటర్లు ఆ గుర్తును పట్టించుకోకుండా కూటమి అభ్యర్థి కర్రోతు చంద్రకళకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నామినేషన్‌ ఉపసంహరణ సాధ్యం కాకపోవడంతో ఓటర్లు ఎలాంటి గందరగోళానికి గురికావద్దని కోరారు. అలాగే భోగాపురం మండల ఎంపీపీ అభ్యర్థిగా కూటమి తరఫున బలపరిచిన మట్టా ఇందుమతికి కూడా తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మండల ప్రజలు ఈ విషయాన్ని గమనించి కూటమి బలపరిచిన అభ్యర్థుల విజయానికి సహకరించాలని నర్సింగరావు కోరారు.