ఇంకొల్లులో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం.
ఇంకొల్లు జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి స్థానిక ప్రజలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శిబిరానికి వచ్చిన రోగులకు వైద్య సిబ్బంది ఎంతో ఓపికగా ఉచితంగా కంటి పరీక్షలతో పాటు రక్తపోటు (బీపీ) వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి తగిన వైద్య సలహాలు, సూచనలు అందిస్తూ అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు చేరువ చేసేలా ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.