ఇంకొల్లు మండలంలో రెండో రోజు 202 నామినేషన్లు
ఇంకొల్లు, మేజర్‌న్యూస్ :
ఇంకొల్లు మండలంలో రెండో రోజు సర్పంచ్ మరియు వార్డు లకు మొత్తం 202 మంది నామినేషన్లు వేసినట్లు ఇంకొల్లు మండల అభివృద్ధి అధికారి గట్టా శ్రీనివాసరావు తెలిపారు. 13 గ్రామ పంచాయితీల్లో సర్పంచ్‌లకు 45 మంది, వార్డు సభ్యులకు 157 మంది నామినేషన్లు దాఖలు చేశారన్నారు. పావులూరులో సర్పంచ్‌కు 6, వార్డు సభ్యులకు 22, కొణికి సర్పంచ్‌కు 2, భీమవరం సర్పంచ్‌కు 3, వార్డు సభ్యులకు 8, దుద్దుకూరు సర్పంచ్‌కు 4, వార్డు సభ్యలకు 17, గంగవరం సర్పంచ్‌కు 3, వార్డు సభ్యులకు 9, ఇడుపులపాడు సర్పంచ్‌కు 6, వార్డు సభ్యులకు 25, ఇంకొల్లు సర్పంచ్‌కు 2, వార్డు సభ్యులకు 25, నాగండ్ల సర్పంచ్‌కు 5, వార్డు సభ్యులకు 21, నక్కలపాలెం సర్పంచ్‌కు 4, పూసపాడు సర్పంచ్‌కు 2, వార్డు సభ్యులకు 12, సుబ్బారెడ్డిపాలెం సర్పంచ్‌కు 2, సూదివారిపాలెం సర్పంచ్‌కు 2, వార్డు సభ్యులకు 11, వంకాయలపాడు సర్పంచ్‌కు 4, వార్డు సభ్యులకు 7 మంది నామినేషన్లు వేశారన్నారు. ఇంకొల్లు మేజర్ పంచాయితి తెలుగుదేశం పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థిగా షేక్ మహ్మద్ రఫి, ఇండిపెండెంట్‌గా అద్దంకి సాయి నామినేషన్లు దాఖలు చేశారు. ఇంకొల్లులో రఫి నామినేషన్ కోలాహలంగా జరిగింది. ఇడుపులపాడు తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పేర్ని బాపయ్య నామినేషన్ వేశారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిబాష, ఇంకొల్లు.