BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

ఇందుకూరుపేటలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఐడీ కార్డుల పంపిణీ

Select Suryaa Now
ఇందుకూరుపేటలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఐడీ కార్డుల పంపిణీ

 

ఇందుకూరుపేట మండలం మేజర్ న్యూస్: ఇందుకూరుపేట మండలం డేవిస్‌పేట గ్రామంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. ఏపీఎల్‌డీఏ చైర్మన్‌ గొల్లపల్లి విజయ్‌కుమార్‌ యాదవ్‌ పాల్గొని కార్యకర్తలకు కార్డులు అందజేశారు. ప్రసాద్‌రెడ్డి రమణయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే బలమని, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గత ఐదేళ్లలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడుతూ 34 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన జీవో విషయంలో చంద్రబాబు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. న్యాయస్థానాల్లో ఎదురైన పరిణామాల నేపథ్యంలో రాజ్యాంగ సవరణ దిశగా ఎందుకు ముందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. బీసీలకు రాజ్యాధికారంలో ప్రాధాన్యం కల్పించిన ఘనత వైఎస్‌ జగన్‌కే దక్కుతుందని పేర్కొంటూ, రాజ్యసభ స్థానాలు, మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యం కల్పించారని తెలిపారు. 56 బీసీ కార్పొరేషన్లు, 750 మంది డైరెక్టర్ల నియామకంతో బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామని చెప్పారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ, సంక్షేమ పథకాలు, బీసీ రిజర్వేషన్ల అంశాలపై ప్రజలకు వాస్తవాలు వివరించాలని కార్యకర్తలకు సూచించారు