ఇందిరాగాంధీ వర్ధంతి
చల్లపల్లి మేజర్ న్యూస్ : దివంగత ప్రధాని, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ 42వ వర్ధంతిని కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకులు మీర్ రిజ్వాన్ ఆధ్వర్యంలో చల్లపల్లిలో శనివారం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారతదేశం లో పేదవర్గాలకు అండగా నిలిచి వారి అభ్యున్నతికి కృషిచేసి ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానాయకురాలు ఇందిర అని రిజ్వాన్ కొనియాడారు. ఈ కార్యక్రమం లో నేతలు కొండేటి భాస్కరరావు, జగ్గవరపు బాబూరావు, పరిశే ప్రసాద్, భాషా, రషీద్బాబు, సాల్మన్రాజు తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, అవనిగడ్డ నియోజకవర్గం, కృష్ణాజిల్లా.