హైపర్ సెన్సిటివ్ గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
లక్కవరపుకోట, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోఎస్ కోట రూరల్ సి ఐ హిమ గిరి ఆధ్వర్యంలో లక్కవరపుకోట మండలంలోని హైపర్ సెన్సిటివ్ గ్రామాలైన కిత్తన్నపేట, చందులూరులలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు . జిల్లా ఎస్ పి ఆదేశాలు మేరకు ఈ ప్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది అని సి ఐ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ హిమగిరి గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, శాంతియుతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఫ్లాగ్ మార్చ్‌లో ఎస్.కోట రూరల్ పోలీస్ సిబ్బంది, ఎస్‌ఐలు, సీఐ పాల్గొన్నారు.