BREAKING
ఆర్నబ్‌ తుపాను తాజా పరిస్థితి అర్ణబ్ తుఫాన్ నేపథ్యంలో వాడరేవులో ఎమ్మార్వో గోపి కృష్ణ పర్యవేక్షణ విద్యార్థులు మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు -ఎమ్మెల్సీ కూచకుల్ల దామోదర్ రెడ్డి -నషా ముక్త్ భారత్ అభియాన్ డ్రగ్స్ ఫ్రీ ర్యాలీ కాలుష్య పరిశ్రమను మూసివేయండి... ఎంపీటీసీ సెగ్మెంట్లలో వైసిపి జడ్పిటిసి అభ్యర్థి అల్లు విజయ్ ప్రాదేశిక ఎన్నికల ప్రచారం. ఎలమ్మ ఆలయంలో అర్ధరాత్రి దొంగతనం వైసీపీ పట్టణ అభివృద్ధి చేసింది లేదు.. ఎమ్మెల్యే బివి నిరుపేద వికలాంగుడికి స్కూటీ పంపిణీ నిరుపేద వికలాంగుడికి స్కూటీ పంపిణీమాజీ జడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్, మెచినేని శ్రీనివాసరావు ట్రస్ట్ సహకారం హోసింగ్ ఏ ఈ సాయి కుమార్ హామీతో,,ఇందిరమ్మ ఇండ్ల బాధితులు ఆందోళన, నిరసన విరమణ కూటమి అభ్యర్థులను గెలిపించండి .. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకే గ్రామంలో రెండు బొడ్రాయిలా?... గ్రామ ప్రజల్లో ఆందోళన భవిష్యత్తు ఉపాధి అవకాశాలను ఎన్నుకోవాలి. డి.ఎస్.పి యూరప్‌లో జెన్-జీ నిరసనల హోరు...ప్రభుత్వాల తీరుపై యువత తీవ్రాగ్రహం ప్రత్యేక అవసరాల విద్యార్థులకు క్రీడ పోటీలు:ప్రారంభించిన మండల విద్యాధికారి శంకర్

గ్యాస్ సిలిండర్ గుర్తుకు ఓటేయండి.. అభివృద్ధికి అవకాశం ఇవ్వండి!

Select Suryaa Now
గ్యాస్ సిలిండర్ గుర్తుకు ఓటేయండి.. అభివృద్ధికి అవకాశం ఇవ్వండి!

గ్యాస్ సిలిండర్ గుర్తుకు ఓటేయండి.. అభివృద్ధికి అవకాశం ఇవ్వండి!

8, 9వ వార్డుల్లో స్వతంత్ర చైర్మన్ అభ్యర్థి డి. నజీర్ ప్రచారం

ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి..ఎమ్మిగనూరు పట్టణంలోని 8, 9వ వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ స్వతంత్ర అభ్యర్థి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ అహ్మద్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బడే ఆద్మీ పార్టీ తరఫున గ్యాస్ సిలిండర్ గుర్తుపై పోటీ చేస్తున్న ఆయన వార్డుల్లోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలు, వ్యాపారులు, యువతను కలుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ, ప్రజలతో మమేకమై ప్రచారం సాగించారు.ఈ సందర్భంగా స్థానికులు తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను నజీర్ అహ్మద్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రహదారులు, వీధి దీపాలు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలకు కృషి చేస్తానని తెలిపారు.మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా తనకు ఉన్న అనుభవాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగిస్తానని పేర్కొన్నారు. ఎన్నికల హామీలకే పరిమితం కాకుండా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.పట్టణ అభివృద్ధిలో ప్రతి వార్డుకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ, ప్రజల అభిప్రాయాలకు విలువనివ్వడమే తన లక్ష్యమని నజీర్ అహ్మద్ స్పష్టం చేశారు. 8, 9వ వార్డుల అభివృద్ధి కోసం తనకు మద్దతు తెలిపి, గ్యాస్ సిలిండర్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

 రాజా శరత్ కుమార్ సూర్యా ప్రతినిధి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా