BREAKING
రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదు : మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ అలుగునూరులో గులాబీ జనసంద్రం! ‘కౌంట్‌డౌన్ షురూ.. 500 రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’- కిక్కిరిసిన సభా ప్రాంగణం.. రోడ్లపైనే నిలిచిపోయిన వందలాది వాహనాలు, ప్రజలు చల్లపల్లి మండలంలో 196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కార్తీక మాస వేడుకల్లో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పొగ రహిత భవిష్యత్తుకు సైన్స్, ఆవిష్కరణలే కీలకం కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు భక్తుల సంతృప్తిలో ఇంద్రకీలాద్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం

గుమ్మపాడు టీడీపీ సర్పంచ్ అభ్యర్థి సింహాద్రమ్మకు మద్దతుగా విస్తృత ప్రచారం..

Select Suryaa Now
గుమ్మపాడు టీడీపీ సర్పంచ్ అభ్యర్థి సింహాద్రమ్మకు మద్దతుగా విస్తృత ప్రచారం..

 

సారవకోట నవంబర్ 29 మేజర్ న్యూస్: గుమ్మపాడు గ్రామ పంచాయతీ టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కత్తిరి సింహాద్రమ్మ విజయాన్ని కాంక్షిస్తూ ఆమె కుమారుడు, సారవకోట మండల టీడీపీ అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆదివారం గ్రామంలోని ప్రతి వీధి, వార్డులో ఇంటింటికీ తిరిగి ప్రజలను కలుసుకుని మద్దతు కోరారు.

ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ, తన తల్లి సింహాద్రమ్మను సర్పంచ్‌గా గెలిపిస్తే గుమ్మపాడు గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రతి ఇంటికీ తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, అర్హులకు సంక్షేమ పథకాలు, విద్యా, వైద్య సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులు, మహిళలు, యువత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొంటూ సింహాద్రమ్మను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఈ ప్రచారంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు అభ్యర్థులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు ప్రచారానికి ఘన స్వాగతం పలికారు.