గుమ్మగట్టలో నామినేషన్ల జాతర - రెండో రోజు 44 సర్పంచ్, 88 వార్డు నామినేషన్లు!
గుమ్మగట్ట మేజర్ న్యూస్:
మండల వ్యాప్తంగా పల్లె పోరుకు రంగం సిద్ధమైంది. సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండవ రోజు సోమవారం మండల వ్యాప్తంగా 44 సర్పంచ్ అభ్యర్థులుగా, 88 వార్డు సభ్యులుగా నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎంపీడీవో జయరాములు తెలిపారు,గుమ్మగట్ట, స్వర్ణ గ్రామం, భూప సముద్రం, గలగల, స్వర్ణ గ్రామం సెంటర్లలో నామినేషన్లు వేశారు. ఉదయం నుంచే ఆయా సెంటర్ల వద్ద అభ్యర్థులు, వారి మద్దతుదారులు భారీగా తరలివచ్చారు,తమ అభ్యర్థులను ఊరేగింపుగా తీసుకొచ్చి నామినేషన్లు వేయించారు,ప్రతి గ్రామంలోనూ సర్పంచ్ పీఠం కోసం పోటీ నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది. యువత, మహిళలు, అనుభవజ్ఞులు ఇలా అన్ని వర్గాల నుంచి అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. వార్డు స్థానాలకు కూడా భారీగా నామినేషన్లు రావడంతో మండలంలో ఎన్నికల వేడి ఒక్కసారిగా పెరిగింది,నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రూరల్ సిఐ వెంకటరమణ, ఎస్సై చినరాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది భద్రత చర్యలు చేపట్టారు. పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించారు. దీంతో రెండవ రోజు నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది,ఇంకా నామినేషన్లకు రేపే చివరి గడువు కావడంతో మరిన్ని నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
సూర్య ప్రతినిధి: పెన్నయ్య గుమ్మగట్ట మండల రిపోర్టర్