గుండెపోటుతో వైసీపీ నేత జంగం కోటి మృతి..!
నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్ - మండల పరిధిలోని వడ్డెమాన్ గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు జంగం కోటి శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే ఎక్కలదేవి ఐజయ్య కుమారుడు వైసీపీ సీనియర్ నేత ఎక్కలదేవి చంద్రమౌళి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచించారు. అంతేకాక గ్రామానికి చెందిన టిడిపి నాయకులు మాజీ సర్పంచులు కట్టా సత్యనారాయణ రెడ్డి, కేశవరెడ్డి నాగేశ్వర రెడ్డి ,రామచంద్రుడు లు మరియు వైసీపీ నాయకులు పోచ బ్రహ్మానందరెడ్డి ,కట్టా రవి కుమార్ రెడ్డి, గ్రామ ఎంపీటీసీ సభ్యుడు కట్టా చంద్రశేఖర్ రెడ్డి లు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.