BREAKING
రాజంపేటలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు బంగారు మైసమ్మ సన్నిధిలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ప్రత్యేక పూజలు ట్రిపుల్ రైడింగ్‌పై పోలీసుల కొరడా.. యువతకు కౌన్సెలింగ్ దుగినేపల్లి చెరువు వద్ద బతుకమ్మ నిమజ్జనానానికి ఏర్పాట్లు అంగడి బజారుకు ప్రత్యేక స్థలం కేటాయించాలి! మండలం ప్రజల డిమాండ్ ఆనవరంలో వైసీపీకి షాక్‌.. టీడీపీలోకి 40 కుటుంబాలు! అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం చప్పబుచ్చంపేట వైసీపీ ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థి ఖరారు పారిశుధ్య కార్మికులకు దసరా కానుకలు అందజేసిన కౌన్సిలర్ శాంతిరాజు నాయక్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ రద్దు... *ఎంపీడీవో బి వి జ పాత్రో పూల పండుగలో పాల్గొన్న మహిళలు.. పాటలు, ఆటలతో సందడి శ్రీ కోట దుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎన్ జి ఓ నాయుకులు నేడు ఎంపీటీసీ ఎన్నికలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల *ఎంపీడీవో నడిమింటి సూర్యనారాయణ వెల్లడి దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాదారం సర్పంచ్ రాములు మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా పట్నాన సాయిశ్రీ ని ఖరారు

గుడిపాడులో గంగమ్మ తల్లికి పంచలోహ ఉత్సవ విగ్రహం వితరణ 40 కిలోల విగ్రహాన్ని అందజేసిన తుమ్మల గంగా ప్రతాపరెడ్డి కుటుంబ సభ్యులు

Select Suryaa Now
గుడిపాడులో గంగమ్మ తల్లికి పంచలోహ ఉత్సవ విగ్రహం వితరణ  40 కిలోల విగ్రహాన్ని అందజేసిన తుమ్మల గంగా ప్రతాపరెడ్డి కుటుంబ సభ్యులు

 

దువ్వూరు, మేజర్ న్యూస్: కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు గ్రామంలో గంగమ్మ తల్లికి తుమ్మల గంగా ప్రతాపరెడ్డి, దుర్గాదేవి దంపతుల కుటుంబ సభ్యులు 40 కిలోల పంచలోహ ఉత్సవ విగ్రహాన్ని వితరణ చేశారు. శనివారం రాత్రి గ్రామస్తులతో కలిసి విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఆదివారం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు, చండీయాగం నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాన్ని ఆలయంలో నిలిపి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కుమారులు వినోద్ కుమార్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, కోడళ్లు మల్లేశ్వరి, సౌజన్య లక్ష్మి, కుమార్తె అనురాధ, అల్లుడు చిదంబేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామ పండుగల సందర్భంగా అమ్మవారి గ్రామోత్సవాలకు ఈ విగ్రహాన్ని వినియోగించనున్నట్లు వేద పండితులు తెలిపారు. విగ్రహాన్ని అందజేసిన ప్రతాపరెడ్డి కుటుంబ సభ్యులను గ్రామస్తులు అభినందించారు.

రిపోర్టర్ : జగన్మోహన్ రెడ్డి, దువ్వూరు, కడప జిల్లా.