గ్రంథాలయ ఉద్యమ వైతాళికులకు ఘన నివాళులు
- శాఖ గ్రంథాలయంలో ఘనంగా వారోత్సవాలు
- నల్ల మధుసూదనరావు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం
గరుగుబిల్లి, సూర్య: గరుగుబిల్లి శాఖ గ్రంథాలయం లో నిర్వహిస్తున్న 59వ జాతీయ గ్రంథా లయ వారోత్సవాలను పురస్కరించు కుని శాఖ గ్రంథాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగు తున్నాయి.గ్రంథాలయ నిర్వాహకులు నల్ల మధుసూదనరావు ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో సోమవారం గ్రంథాలయ ఉద్యమ నాయకులను ఘనంగా స్మరించుకున్నారు.ఈసంద ర్భంగా గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య,పాతూరి నాగభూషణం,గురజాడ అప్పారావు, వావిలాల గోపాలకృష్ణయ్య తదితర మహనీయుల చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పిం చారు.అనంతరం గ్రంథాలయం నిర్వాహకులు నల్ల మధుసూదనరావు మాట్లాడుతూ నిరక్షరాస్యత నిర్మూల నకు మరియు విజ్ఞాన వ్యాప్తికి గ్రంథా లయ ఉద్యమ నాయకులు చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.నేటి తరం విద్యార్థులు, యువత సెల్ ఫోన్లకు దూరంగా ఉండి, పుస్తక పఠనం వైపు మొగ్గు చూపాలని పిలుపునిచ్చా రు.సమాజ నిర్మాణంలో గ్రంథాలయా లు కీలక పాత్ర పోషిస్తాయని మధుసూ దనరావు పేర్కొన్నారు.ఈకార్యక్రమం లో తుమ్మగుంట శంకర్రావు, స్థానిక పాఠకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.