BREAKING
39 సార్లు రక్తదానం చేసిన జి. జయరాజుకు ఘన సన్మానం చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాలకు మంత్రి దామోదర రాజనర్సింహ అమెరికా ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో సాంకేతిక లోపం: ఇండియా డైరెక్ట్ ఫ్లైట్స్ సురక్షితం, కార్తీక పౌర్ణమి సందర్భంగా నవ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు ఢిల్లీలో కాలుష్యం తీవ్రత దృష్ట్యా ఎయిర్ ప్యూరిఫయర్లకు ఐదు రెట్లు పెరిగిన డిమాండ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా నూతన పెన్షన్ పత్రాల పంపిణీ భారతీయ సంస్కృతి, సామాజిక సమైక్యతకు ఛత్‌ పూజ ప్రతీక: ఎంపీ ఈటల రాజేందర్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పించాలి దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి: హమాస్ కమాండర్ హతం ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం. మల్లూరు గుట్టకు మహిళల పాదయాత్ర

గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం

Select Suryaa Now
గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :  ఆత్మకూరు శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శనివారం ప్రారంభమైనవి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్టూడెంట్స్ మోటివేటర్ వెలిశెట్టి నారాయణరావు , విశ్రాంత గ్రేడ్-2 గ్రంథ బాండాగారి ఏ.గోవిందరెడ్డి  మరియు మేథా హై స్కూల్ కరస్పాండెంట్ టి. సి.వి.సుబ్బయ్య  విచ్చేసి  సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలనతో వారోత్సవ కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మన దేశానికి తొలి ప్రధానమంత్రిగా వారు చేసిన సేవలను కొనియాడుతూ నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం ఇన్చార్జి లైబ్రేరియన్ ఓ. శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఈ వారోత్సవాలు 20వ తేదీ వరకు నిర్వహించబడతాయని పాఠశాల విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి ముగింపు సమావేశంలో ముఖ్య అతిథులు చేతుల మీదుగా బహుమతులు అందజేయబడతాయని తెలియజేశారు. తదుపరి వక్తలు తమ ఉపన్యాసంలో గ్రంథాలయాల ఉపయోగాన్ని గురించి పుస్తక పఠన ప్రయోజనాలను గురించి వివరిస్తూ మంచి పుస్తకం ఒక మంచి మిత్రునితో సమానమని తెలియజేశారు.అనంతరం పిల్లలకు చాక్లెట్స్, బిస్కెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాఠకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని జయప్రదం చేశారు.