గోవిందా.. గోవిందా.. వైభవoగా శ్రీచక్రస్నానం
గరుగుబిల్లి, సూర్య : ఉత్తరాంధ్రలో చిన తిరుపతిగా ప్రసిద్ధి చెందిన గరుగుబిల్లి మండలం తోటపల్లిలో వేంచేసి ఉన్న శ్రీవెంకటే శ్వరస్వామి ఆలయం శనివారం గోవింద నామస్మరణతో మార్మోగింది. ఈనెల 21వ తేదీ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీచక్రతీర్థ స్నానము కార్యక్రమంతో అత్యంత వైభవంగా ముగిశాయి.ఈమేరకు ఉదయం సుప్రభాతసేవ,బాలబోగము, చూర్ణోత్సవము, స్నపనం తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. అనం తరం మేళతాళాలతో స్వామివారి ఉత్సవ విగ్రహాలను పవిత్ర నాగావళి నది వరకు తిరువీధి మహోత్సవమును నిర్వహించారు.ఈసందర్భంగా పవిత్ర నాగావళి నది యందు శ్రీచక్రతీర్థస్నాన ములు, చతు స్థానార్చనము,నవకలశ స్నపనము తదితర పూజా కార్యక్రమా లను శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ వి వి అప్ప లాచార్యులు అదే విధంగా శ్రీమాన్ జొన్నాడ భట్టరు హరికృష్ణమాచార్యు లు ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేత ముగా నిర్వహించారు.పవిత్ర నాగావళి నది అందు నిర్వహించిన శ్రీచక్ర తీర్థ స్నానములు కార్యక్రమములో పలు ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవములు ముగింపు సంద ర్భముగా శనివారం రాత్రి ద్వాదశరాధనములు, విశేషహోమములు, పూర్ణా హుతి శ్రీధ్వజఅవరోహణలు,మంగళా శాసనములు,శాత్తుమొరై పూజా కార్య క్రమాలను నిర్వహించడం జరిగిందని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వివి సూర్యనారాయణ పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది గంట శ్రీధర్ నాయుడు, మరిశర్ల బలరామునాయుడుతోపాటు సేవకులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : శశి భూషణరావు, గరుగుబిల్లి, పార్వతిపురం మన్యం.