గొడవలు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు. పల్లె నిద్రలో సీఐ నాగమల్లేశ్వరరావు.
సూర్య న్యూస్ దర్శి.
గ్రామాల్లోని ప్రజలు చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని దరిశి సీఐ ఎం నాగమల్లేశ్వరరావు సూచించారు. ఎస్పీ ఆదేశాల మేరకు బొట్లపాలెం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా సీఐ గ్రామస్తులతో మాట్లాడుతూ - గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై తగు సూచనలు చేశారు. అదే విధంగా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి, శాంతిభద్రతల పరిరక్షణ, గ్రామంలో ఐక్యతపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో దర్శి ఎస్సై జి ఏడుకొండలు, బొట్లపాలెం గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.