గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రారంభోత్సవం
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రారంభం - జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి. గ్రామ స్వావలంబన, గ్రామీణ ఆర్థికాభివృ అనే ఆశయాలను గుర్తుచేసుకునే ఈ శుభదినాన, గౌరవ ముఖ్యమంత్రివర్యులు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ను ప్రారంభించడం రాష్ట్ర ఉద్యానరంగానికి ఒక ముఖ్యమైన ముందడుగు.
ఉద్యానవన పంటలు రైతులకు ఆదాయం పెంచే అవకాశాన్ని కల్పిస్తాయి. అయితే నాణ్యమైన నాటుసామగ్రి, నీటి సమర్థ వినియోగం, శాస్త్రీయ సాగు పద్ధతులు, పంట అనంతర నిర్వహణ, నిల్వ ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఈ అంశాలన్నీ సమన్వయంతో ముందుకు సాగాలి. గ్లోబల్ హార్టికల్చర్ హ వంటి వేదికలు ఈ సమగ్ర దృక్పథానికి దిశానిర్దేశం చేయగలవు.
కనిగిరి క్లస్టర్ సమగ్ర ఉద్యాన అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికలో కనిగిరి, హనుమంతునిపాడు, వెలిగండ్ల, పామూరు, చంద్రశేఖరపురం, పీసీ పల్లి మండలాలను చేర్చాం. ఈ క్లస్టర్లో 78 రైతు సేవా కేంద్రా 179 గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం సుమారు 5,598 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి; సుమారు 4,660 మంది రైతులు ఈ రంగంతో అనుసంధానమై ఉన్నారు.ఈ ప్రణాళికలో మూడు సంవత్సరాల కాలానికి ఉద్యాన విస్తీర్ణాన్ని 12,815 హెక్టార్ల మేర పెంచడం, 14,666 హెక్టార్లలో సూక్ష్మసేద్యం, ఫర్టిగేషన్ మరియు ఆటోమేషన్ వంటి సాంకేతికతలను ప్రోత్సహించడం, ఇప్పటికే ఉన్న తోటల్లో 950 హెక్టార్లలో ఉత్పాదకత పెంపు చర్యలు చేపట్టడం లక్ష్యంగా పెట్టుకున్నాం.
అలాగే పంట అనంతర నిర్వహణ మరియు రవాణా సదుపాయాలకు 60 యూనిట్లు, ప్రాసెసింగ్- విలువ జోడింపు-బ్రాండింగ్ కు 36 యూనిట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు 405 యూనిట్లు, ధృవీకరించిన నర్సరీలు 2, మార్కెట్ మౌలిక సదుపాయాలు/సేకరణ కేంద్రం 1 ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం. క్షేత్రస్థాయి ప్రదర్శనలు, రైతు శిక్షణలు, అవగాహన కార్యక్రమాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల వద్దకు తీసుకెళ్లడం కూడా ప్రణాళికలో భాగం. ఈ క్లస్టర్ ప్రణాళికకు ప్రతిపాదిత మొత్తం వ్యయం సుమారు రూ.465.16 కోట్లు ఇందులో ప్రభుత్వ రయితీ 247.68 కోట్లు ప్రణాళిక అమలుతో మూడు సంవత్సరాల్లో ఉద్యాన విస్తీర్ణం సుమారు 18,381 హెక్టార్లకు, ఉత్పత్తి సుమారు 2.21 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుతుందని అంచనా. స్థూల విలువ జోడింపు సుమారు రూ.1,327.29 కోట్లకు పెరగడం, పంట అనంతర నష్టాలను 15 శాతం నుంచి 8 శాతానికి తగ్గించడం లక్ష్యాలుగా పేర్కొన్నారు. ఇవి ప్రణాళిక లక్ష్యాలు మాత్రమే; సమర్థవంతమైన అమలు, రైతుల భాగస్వామ్యంతో సాధించాల్సిన లక్ష్యాలు.
మదనపల్లిలో ప్రారంభమవుతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అనుభవాలు, సాంకేతికత, నాణ్యత ప్రమాణాలు, మార్కెట్ అనుసంధానంపై అవగాహన పెంపొందించేందుకు ఒక ప్రేరణగా నిలుస్తాయి. కనిగిరి క్లస్టర్లోనూ రైతు ఉత్పత్తి సంఘాలు, మార్కెటింగ్ సంస్థలు, ప్రాసెసింగ్ యూనిట్లు, రవాణా వ్యవస్థల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తాం.
గౌరవ ముఖ్యమంత్రివర్యుల మార్గదర్శకత్వంలో, మన కనిగిరి నియోజకవర్గం శాసనసభ్యులు గారి నేతృత్వంలో, ప్రజాప్రతినిధుల సహకారంతో, రైతుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలను పారదర్శకంగా, కాలపరిమితిలో అమలు చేయడానికి శాఖ కట్టుబడి ఉంది. రైతు సోదరులు ఉద్యానశాఖ అధికారులను సంప్రదించి, పంట ఎంపిక నుంచి మార్కెటింగ్ వరకు అందుబాటులో ఉన్న సాంకేతిక సలహాలు మరియు పథకాల ప్రయోజనాలను వినియోగించుకోవాలని కోరుతున్నాము