BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

ఘనంగా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా ఎన్నికలు

Select Suryaa Now
ఘనంగా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా ఎన్నికలు


- నూతన కమిటీ అధ్యక్షులుగా డాక్టర్ ఎన్.మునిగోపాలకృష్ణ
- అట్టహాసంగా ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం 
మదనపల్లె,మేజర్ న్యూస్ : ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యం లో అన్నమయ్య జిల్లా ఎన్నికలు ఆదివారం స్థానిక జిఆర్టి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ నందు నిర్వహించారు.ఇందులో ఎపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎన్.మునిగోపాలకృష్ణ తిరిగి అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.అలాగే పంచ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.అన్నమయ్య జిల్లా యూనిట్ కు జరిగిన ఎన్నికల్లో గౌరవ అధ్యక్షుడు వై.ఎస్.మునిరత్నమయ్య,సలహాదారులుగా ప్రొఫెసర్ శ్రీనివాసులు,టి.ఎస్.ఎ. కృష్ణమూర్తి,జనరల్ సెక్రటరీ ఆర్.వి.వెంకటేశ్వర రావు,కోశాధికారి పి.సి.తిమ్మయ్య,వైస్ ప్రెసిడెంట్లుగా ఆర్.జగన్ మోహన్,సి.సురేంద్ర రెడ్డి,ఎం.రామచంద్ర,జాయింట్ సెక్రటరీ సి.సరస్వతి,సి.వెంకటరమణ,ఈసీ సభ్యులుగా 
కె.ధనలక్ష్మి,ఎన్.రామచంద్ర రెడ్డి,కె.ప్రభాకర్ తదితరులు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారు ఢిల్లీ విశ్వ విద్యా లయం రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్.చంద్రశేఖర్,పరిశీలకులు సత్యసాయి జిల్లా వయోవృద్ధుల నాయకుడు నాగేంద్రరెడ్డిలు ప్రకటించారు.అనంతరం జరిగిన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవానికి వెలుగు సంస్థ కన్వీనర్ భాగ్యలక్ష్మి,చైతన్య సంస్థ జనరల్ సెక్రటరీ కవితా రాణి,కాలువపల్లె కృష్ణ మూర్తి,లక్ష్మీదేవి,శకుంతలమ్మ,కలికిరి సురేంద్ర రెడ్డి,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎన్.మునిగోపాల కృష్ణ,ఈసి మెంబర్ ధనలక్ష్మి,మదనపల్లె యూనిట్ అధ్యక్షులు సి.ఆర్ శ్రీనివాసులు తదితరులను దుశ్యాలువ,పూలమాల,జ్ఞాపికలతో ఘనంగా సన్మా నించారు.ఈ సందర్బంగా మునిగోపాలకృష్ణ మాట్లాడుతూ నేడు మదనపల్లెలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.అదేవిధంగా అసోసియేషన్ జిల్లా వ్యాప్తంగా విస్తరించే క్రమంలో ఇప్పటికే కలికిరి తమ్మలపల్లిలో కమిటీలు ఏర్పాటు చేశామని త్వరలో మరిన్ని మండలాల్లోనూ కమిటీలు ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.అదే క్రమంలో మదనపల్లి యూనిట్ తో పాటు అన్నమయ్య జిల్లాకు పార దర్శకంగా ఎన్నికలు నిర్వహించి కమిటీలు ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.మదనపల్లె నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.అసోసియేషన్ సంబంధించిన పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఇదేవిధంగా ఐకమత్యంతో ముందుకు సాగుతూ సమాజానికి ఆదర్శవంతంగా నిలపాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పలువురు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి