ఘనంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
– శ్రీశైలంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు*
*గిద్దలూరు: గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, అపర భగీరథ, పేదలపాటి పెన్నిధి, గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆయనకు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.*
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, గిద్దలూరు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించారు.*
*ప్రజాసేవకు అంకితమై నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారికి పలువురు ప్రముఖులు, కూటమి నాయకులు, అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.*