గీతంలో కృత్రిమ మేధపై జాతీయ సదస్సు
విశాఖ ఎడ్యుకేషన్, సూర్య : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నెక్ట్స్ జెన్ కంప్యూటింగ్ అనే అంశంపై మంగళవారం రెండు రోజుల పాటు జరిగే జాతీయ సదస్సు ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐఐటి బెంగళూరు వ్యవస్థాపక డైరక్టర్ ప్రొఫెసర్ సౌమ్య నారాయణన్ సదాగోపన్, ఐఐఐటి బెంగళూరు సిఎసఇ విభాగాధిపతి ప్రొఫెసర్ మీనాక్షి డిసౌజా, బిట్స్ పిలానీ హైదరాబాద్ సిఎస్ మరియు ఐఎస్ విభాగాధిపతి ప్రొఫెసర్ పరేష్ సక్సేనా, కొరియోలిస్ టెక్నాలజీస్ సిఈఓ డాక్టర్ బసంత్ రాజన్, గీతం ప్రో`వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వై.గౌతమ్‌రావు మరియు స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ ఎ.అరుణ్‌కుమార్ తదితర ప్రముఖలు పాల్గొని తమ విశ్లేషణాత్మక ఆలోచనలను పంచుకున్నారు.
నిపుణులు తమ ప్రసంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ ఆధునిక సాంకేతికత కలయికతో సాంప్రదాయ కోర్ ఇంజనీరింగ్ రంగాలు పునర్ వైభవాన్ని సంతరించుకుంటున్నాయని ఈ సదస్సులో నిపుణులు ప్రధానంగా చెప్పారు. కృత్రిమ మేధ అనేది మానవ మేదస్సుకు ప్రత్యామ్నాయం కాదని, అది ప్రతిభను పెంచే ఒక సాధనం మాత్రమేనని నిపుణులు పేర్కొన్నారు. కృత్రిమ మేధ వినియోగంలో సాంకేతిక నిపుణులు బాధ్యతతో వ్యవహరించాలని లేదంటే దానికి తగ్గ ప్రతిఫలం అనుభవించవలసి ఉంటుందని హెచ్చరించారు. భారతదేశంలో లభిస్తున్న అపారమైన సాంకేతిక వనరులను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్ధులు, పరిశోధకులు నూతన ఆవిష్కరణలు మరియు వాణిజ్య ఉత్పత్తులను రూపొందించాలని పిలుపునిచ్చారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడంపై సదస్సులో ప్రత్యేకంగా చర్చించారు. ఐఓటి సెన్సార్లు, నేల తేమను పరిశీలించే పరికరాలు ఆటోమేటడ్ నీటిపారుదల వ్యవస్థల ద్వారా ఫసల వంటి ఎఐ ఆధారిత స్టార్టప్‌లు సృష్టిస్తున్న మార్పులను వివరించారు. ఖచ్చితత్వ వ్యవసాయం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడం, రసాయనాల వాడకాన్ని అదుపు చేయడం మరియు వాతావరణ మార్పులను తట్టుకుని దిగుబడిని పెంచడం సాధ్యమవుతుదంని స్పష్టం చేశారు. దీనితో పాటు స్మార్ట్ టెక్స్టైల్స్ ఈ టెక్స్టైల్స్ మరియు 3డి ప్రింటింగ్, నిర్మాణ రంగాల్లో వస్తున్న సాంకేతిక పురోగతిని ప్రతినిధులు చర్చించారు. బెంగళూరులో రికార్డు స్థాయిలో 45 రోజుల్లో నిర్మించిన దేశపు తొలి 3డి ప్రిండెడ్ పోస్ట్ ఆఫీస్ నిర్మాణాన్ని ఒక మైలురాయిగా ప్రస్తావించారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇటీవల కంప్యూటర్ సైన్స్ మినహ ఇతర సాంప్రదాయ ఇంజనీరింగ్ విభాగాలలో కొత్త బిటెక్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించడాన్ని నిపుణులు ఉదాహరణగా పేర్కొన్నారు.
కార్యక్రమంలో గీతం సూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డైరక్టర్ డాక్టర్ కె.తిరుపతిరావు, సిఎసఇ విభాగం అధిపతి ప్రొఫెసర్ జి.వి.ఎస్.రాజ్‌కుమార్, డాక్టర్ కె.నవీన్‌కుమార్, సహ పలువురు విద్యావేత్తలు, పాల్గొన్నారు. కంప్యూటర్ సైన్స్ మరియు భవిష్యత్ ప్రారిశ్రామిక అనువర్తనాల మధ్య అంతరాన్ని తగ్గించే లక్ష్యంతో చేపట్టిన ఈ విద్యా కార్యక్రమానికి విద్యార్ధులు, పరిశోధకులు మరియు అధ్యాపకులు పెద్ద ఎత్తున హజరయ్యారు.
రిపోర్టర్ : సత్యనారాయణ, ఏయూ, విశాఖపట్నం.